K.V.SHARMA EDITOR
ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఆగష్టు 19:తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ ( శరత్ చంద్ర ) బుధవారం ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఏయూలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఏయూ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏయూ తరపున తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి విల్సన్‌ను ఆంధ్రవిశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు సత్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రవిశ్వవిద్యాలయం అధికారులు, తెలుగు అకాడమీ ప్రాంతీయ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment