. D.S.VARMA Sr Sub EDITOR
విశాఖపట్నం :ఈరోజు 15-08-2026 శనివారం ఉదయం 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు గారి అధ్యక్షతన లాసన్స్ బే కాలనీ లోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ N మధుకర్ జి విచ్చేసారు.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా మధుకర్ జి మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో విశాఖ పుర ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర పోరాట ఉద్యమంలో అసువులు బాసిన అనేక వేలమంది స్వాతంత్య్ర పోరాట వీరులను స్మరిస్తూ, హర్ ఘర్ తిరంగా పేరుతో మన దేశంలోని ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందని అన్నారు. బ్రిటీష్ పాలనలో ఆర్ధిక దోపిడీ, అభివృద్ధి లేమితో కొట్టుమిట్టాడిన భారతదేశం ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించింది అన్నారు. బ్రిటీష్ పరిపాలనకు పూర్వం, గుప్తుల కాలంలో ప్రపంచ ఆర్ధిక రంగంలో భారతదేశ వాటా 50 % గా ఉండేదని, ఆ తరువాత బ్రిటీష్ పాలనలో మందగించిందని గుర్తు చేసారు.
జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేడు 4 వ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించిందని అన్నారు. స్వచ్ఛ భారత్ ద్వారా గ్రామాలలో, నగరాలలో పారిశుధ్యం పెంపొందించి, సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ కు నోచుకోని అనేక గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించారని కొనియాడారు. భారత దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా అనేక చారిత్రాత్మక, ప్రజోపయోగ నిర్ణయాలను తీసుకున్న ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ ఆర్ధిక వ్యవస్థను, ప్రతిష్టను పటిష్ట పరుస్తూ ఆత్మనిర్భర భారత్ దిశగా పురోగమిస్తున్నదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జోనల్ ఇంచార్జి మట్ట ప్రసాద్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత, బీజేపీ రాష్ట్ర కోశాధికారి M నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. K సుహాసిని ఆనంద్, బీజేపీ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి SVS ప్రకాష్ రెడ్డి, బీజేపీ విజయనగరం జిల్లా ఇంచార్జి N విజయానంద రెడ్డి, బీజేపీ పార్వతీపురం జిల్ ఇంచార్జి పొలిమేర శ్రీనివాస రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు G ప్రేమ కుమారి, సాగి కాశీవిశ్వనాథ రాజు గారు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments
Post a Comment