Skip to main content

ఘనంగా ఉచిత రీతిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు


ఇసుకకొండ దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ దేవాదాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి టి రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో ఉచిత రీతిన సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు పి నరసింహచార్యులు శ్రీ పాంచరాత్ర ఆగమ సాంప్రదాయంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను నిర్వహించారు . హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ( హెచ్ డి పి టి ) దేవదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత రీతిన నిర్వహించిన వ్రతాలలో 325 మంది జంటలు పాల్గొని వ్రతాలను ఆచరించుకుని  అలయంలో వేంచేసియున్న శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు . ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ టి అన్నపూర్ణ , హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు ,  ప్రాంతీయ సమన్వయకర్త జి ఆర్ కే ప్రసాద్ ( రాంబాబు ) , హెచ్ డి పి టి సభ్యులు ఆధ్యాత్మికవేత్త ఎం వి రాజశేఖర్ ,  పి జగన్ మోహనరావు , ఎమ్ వి కే కే సత్యనారాయణ ,  ఆలయ చైర్మన్ , ధర్మకర్తల మండలి సభ్యులు , హెచ్ డి పి టి అనకాపల్లి జిల్లా సభ్యులు ,  ఎఎస్ఆర్ జిల్లా సభ్యులు , నర్సీపట్నం సభ్యులు ,  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు . కార్యక్రమానికి ముందుగా శుభ సూచకంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రాంతీయ కార్యదర్శి డాక్టర్ జి.ఆర్ కె ప్రసాద్ (రాంబాబు) ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ రాజగోపాల్ రెడ్డి ఆలయ బోర్డ్ చైర్మన్ ప్రసాద్ అలాగే హెడ్ టి పి టి సభ్యులు బోర్డు సభ్యులు కలిపి జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు. 


హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసులు IAS (R) మాట్లాడుతూ వ్రతాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయబోతున్నామని ఆలయ అధికారి లకు ఆలయ చైర్మన్ కి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు .


హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ 'ధర్మో రక్షతి రక్షితః" ధర్మాన్ని రక్షించడం, కాపాడడం ,పెంపొందింప చేయడం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం అని అందులో భాగంగా బీద బడుగు వర్గాల వారికే కాకుండా అందరికీ ఉచితంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరింపచేసి ఆ స్వామి అనుగ్రహం వారి మీద పూర్తిగా ఉండాలని వారందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. స్థలాభావం అయినప్పటికీ

 వచ్చిన భక్తులందరికీ వ్రతం చేసుకునే భాగ్యం కలిగించడం జరిగింది. 

 పూజా సామాగ్రి కూడా దేవస్థానమే సమకూర్చి పూర్తిగా ఉచితంగా వ్రతాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.


దేవస్థానం కార్య నిర్వహణ అధికారి టి రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో ట్రస్టు బోర్డు సభ్యుల సహకారంతో సామూహికంగా 325 దంపతులచే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఘనంగా నిర్వహించారు.  

  భక్తులు  వ్రతాలను ఆచరించుకుని  అలయంలో వేంచేసియున్న శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు .


ఈ కార్యక్రమంలో, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డా.దాసరి శ్రీనివాసులు IAS (R) ,    ప్రాంతీయ సమన్వయకర్త డా. జి ఆర్ కే ప్రసాద్ ( రాంబాబు ) , హెచ్ డి పి టి సభ్యులు ఆధ్యాత్మికవేత్త శ్రీ ఎం వి రాజశేఖర్ ,  పి జగన్ మోహనరావు , ఎమ్ కె వి వి  సత్యనారాయణ ,  ఆలయ చైర్మన్ శ్రీ ప్రసాద్  , ధర్మకర్తల మండలి సభ్యులు , హెచ్ డి పి టి అనకాపల్లి జిల్లా సభ్యులు ,  ఎఎస్ఆర్ జిల్లా సభ్యులు , నర్సీపట్నం సభ్యులు ,  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు .

చివర్లో భక్తులందరికీ ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది.

                  K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...