విశాఖపట్నం. ఈరోజు అనగా 04-08-2026 ఆశా డే సందర్భంగా పీహెచ్సీలలో మరియు యూపీహెచ్సీలలో తల్లిపాలు వారోత్సవాల గురించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వర్ రావు గారు ఈరోజు అనంతపురం మండలం పీహెచ్సీ ఆనందపురంలో తల్లిపాలు వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువులకు ముర్రె పాలు ఇవ్వడం వల్ల వారంతో ఆరోగ్యంతో ఉంటారని ఆయన తెలియజేశారు. పుట్టినప్పటినుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పెట్టాలని ఆ తర్వాత అనుబంధం ఆహారంతోపాటు తల్లిపాలు పట్టవలసింది అని ఆయన తెలియజేశారు. దీనివల్ల తల్లి బిడ్డకు బంధం ఏర్పడుతుందని మరియు దీనివల్ల శిశు మరణాలు కూడా తగ్గుతాయని, క్రమం తప్పకుండా తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి కూడా ఆరోగ్యం అంతగా ఉంటుందని అన్నారు.
తల్లిపాలుపై పూర్తి అవగాహన తీసుకురావాలని ఆయన వైద్య సిబ్బందికి, ఐసిడిఎస్ సిబ్బందికి మరియు ప్రోగ్రాం అధికారులకు, ఏఎన్ఎం లకు,ఆశాలకు,సూచించారు. ప్రతి నెల 9వ తేదీలో జరిగే కార్యక్రమంలో పి ఎం ఎస్ ఎం ఏ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు అవగాహన కలిగించాలని ఆదేశించారు. గర్భిణీ స్త్రీ అని తెలియగానే మూడు నెలల నుంచి అవగాహన కల్పించడం వలన ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలియజేశారు. వర్షాకాలం దృశ్య ప్రతియాస మరియు ఏఎన్ఎం నీళ్లు నిలువ ఉండే ప్రదేశాలు లేకుండా చూసుకోవాలని ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, దోమల గుడ్డు పెట్టడం ద్వారా లార్వా పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆ దిశగా ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. గృహ సందర్శనలో భాగంగా ఫీవర్ సర్వ నిర్వహించి జ్వర పీడితుల గుర్తించి వెంటనే చికిత్స చేయాలని అవసరమైతే తదుపరి పరీక్ష చికిత్స నిమిత్తము పీహెచ్సీకి రిఫర్ చేయాలని సూచించారు. తదుపరి పీహెచ్సీ ల్యాబ్ ను సందర్శించి ఆక్టివ్ మరియు పాసివ్ సర్విలియన్స్ పై సమీక్ష చేసి ఓపిడి నుండి 15% పాసు సర్విలియన్స్ మరియు ప్రతి ఏఎన్ఎం కనీసం 25 నుండి 30 ఆక్టివ్ సర్విలియన్స్ ఉండాలని ఆదేశించారు. NVBDCP కార్యక్రమంపై సిబ్బందితో సమీక్ష నిర్వహించాలని వైద్య అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి డాక్టర్ లూసీ కార్డీ ఆలియా, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ బి ఉమావతి, మరియు ప్రోగ్రాం అధికారులు వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ సబీనా భాను సాదియా డాక్టర్ షహనాజ్ పాల్ సాధ్య జిల్లా ఆశా కార్డినేటర్ మణికుమార్ మరియు అసిస్టెంట్ మలేరియా అధికారి అయినటువంటి నాగభూషణం గారు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి,
విశాఖపట్నం.



Comments
Post a Comment