Skip to main content

శెహ‌భాష్‌...లోకేష్‌..* *మంత్రి నారా లోకేష్ భుజం త‌ట్టిన ప్ర‌ధాని మోదీ*


నువ్వు చాలా బాగా ప‌నిచేస్తున్నావు.. శెహ‌భాష్‌..లోకేష్‌`` అంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఏపీ విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ భుజం త‌ట్టారు. భోగాపురంలోని అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వం చేసిన అనంత‌రం బ‌య‌లుదేరిన ప్ర‌ధానికి నారా లోకేష్ వీడ్కోలు ప‌లికారు. ఆప్యాయంగా భుజం త‌ట్టిన ప్ర‌ధాని.. బాగా ప‌నిచేస్తున్నావు..ఇదే వేగం, స్ఫూర్తితో ప‌నిచేయాల‌ని సూచించారు. గ‌తంలోనూ ఏపీలో ప్ర‌ధాని మోదీ పాల్గొన్న కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతం చేయ‌డం, యోగాంధ్ర రికార్డు సాధ‌నలో కీల‌క పాత్ర పోషించిన లోకేష్ కృషిని అప్ప‌ట్లో ప్ర‌ధాని మెచ్చుకున్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...