Skip to main content

గాయత్రీ విద్యా పరిషత్ కళాశాలలో ముగిసిన ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్


విశాఖపట్నం, ఆగస్టు 14: నగరంలోని ఎం.వి.పి. కాలనీలో గల గాయత్రీ విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ (అటానమస్)లో కంప్యూటర్ సైన్స్ విభాగం మరియు ఐసిటి అకాడమీ (ICT Academy) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు రోజుల జాతీయ స్థాయి ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (FDP) శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ‘డేటా అనలిటిక్స్ యూజింగ్ పైథాన్’ (Data Analytics Using Python) అనే అంశంపై ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు కుమారి లయ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు శ్రీమతి వై.ఎస్. విజయలక్ష్మి అతిథులకు వేదికపైకి సాదర స్వాగతం పలికారు.


ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల డైరెక్టర్ శ్రీ డి. గిరిధర్ మాట్లాడుతూ, “నేటి డిజిటల్ యుగంలో డేటా అనలిటిక్స్ పాత్ర అత్యంత కీలకమైనది. అధ్యాపకులు నిరంతరం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యసిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి” అని సూచించారు. ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు బోధనా ప్రమాణాలను మరింత పెంపొందించడానికి దోహదపడతాయని పేర్కొంటూ, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి శ్రీ కృష్ణ కుమార్, శ్రీమతి వై.ఎస్. విజయలక్ష్మి, నిర్వాహక బృందం మరియు శిక్షణలో పాల్గొన్న అధ్యాపకులను ఆయన అభినందించారు.

తదనంతరం, శిక్షణా కార్యక్రమానికి ట్రైనర్‌గా వ్యవహరించిన శ్రీ రాకేష్ పువ్వాడిని కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకురాలు కుమారి వసంత పరిచయం చేశారు.


ఐదు రోజుల పాటు సాగిన ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రముఖ టెక్నికల్ ట్రైనర్ శ్రీ రాకేష్ పువ్వాడి మాట్లాడుతూ, పైథాన్ ద్వారా డేటా అనలిటిక్స్, డేటా మోడలింగ్, డేటా ప్రాసెసింగ్ తదితర అంశాలపై అధ్యాపకులకు ఆచరణాత్మక అవగాహన కల్పించడం ప్రస్తుత సాంకేతిక యుగంలో ఎంతో అవసరమని తెలిపారు. శిక్షణలో భాగంగా డేటాను విశ్లేషించడం, ప్రాసెస్ చేయడం, మోడలింగ్ చేయడం వంటి అంశాలను ప్రాక్టికల్‌గా వివరించారు.


ఈ కార్యక్రమంలో గాయత్రీ విద్యా పరిషత్ కళాశాల అధ్యాపకులతో పాటు ఆదర్శ్ డిగ్రీ కాలేజ్, అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, దాడి ఇన్‌స్టిట్యూట్, డాక్టర్ ఎల్.బి. కాలేజ్, NSRIT ఇంజినీరింగ్ కాలేజ్, శ్రీపాద కాలేజ్ తదితర విద్యాసంస్థలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కంప్యూటర్ అధ్యాపకులు శ్రీ శంకర్ శాస్త్రి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు  పాల్గొన్నారు.

కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు శ్రీమతి మాధురి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...