. SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం....భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీని అల్లవరం మండలం కొమరగిరిపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, హర్ష విజ్ఞాన భారతి స్కూల్ విద్యార్థులు సంయుక్తంగా పాల్గొని ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపిడిఓ కె. గౌరీ కుమారి, మండల విద్యాశాఖ అధికారి కె. కిరణ్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీ నరసమ్మ పాల్గొని విద్యార్థులతో కలిసి బెండమూర్లంక సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. హర్ష విజ్ఞాన భారతి విద్యార్థులు గోష్ వాయిద్యాలతో ర్యాలీ మరింత ఉత్సాహంగా సాగింది.
అనంతరం మానవ హారంగా నిలబడి భారత మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని నింపే లక్ష్యంతో దేశ పౌరులుగా మన బాధ్యతను గుర్తుకు చేసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి, పసుపులేటి మహాలక్ష్మి, సంసాని రత్నకుమార్, కటికి రెడ్డి తమ్మయ్య నాయుడు, కొమరగిరిపట్నం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, అరసవిజ్ఞాన భారతి ప్రిన్సిపల్ హర్షవర్ధన్, పీఈటీలు రమేష్,సుబ్రహ్మణ్యం, వివేకానంద సేవా సమితి ప్రధాన కార్యదర్శి కడలి నాగరాజు, అంగాని ధనుంజయ వర్మ, దుర్గాప్రసాద్,మొల్లేటి రామ్ కుమార్, దొమ్మేటి నాని, కట్టా జనార్ధన్,తోట విశాల కృష్ణ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment