Skip to main content

సహజ, సుస్థిర వ్యవసాయంపై సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో ఒకరోజు జాతీయ సదస్సు


విశాఖపట్నం :విశాఖ సందేశం వర్తవాహని :ఆగస్టు 20, 2026: సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ (స్వయంప్రతిపత్తి), విశాఖపట్నంలో “Millets to Models: Natural and Sustainable Farming for the 21st Century” అనే అంశంపై ఒకరోజు సదస్సును ఆగస్టు 22న సెమినార్ హాల్–1లో నిర్వహించనున్నారు. వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి, వృక్షశాస్త్రం, బయోటెక్నాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది.

కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి. సదస్సు బ్రోషర్‌ను ఆవిష్కరించి మాట్లాడుతూ, సహజ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు ద్వారా రసాయన రహిత, వాతావరణ మార్పులను తట్టుకునే, రైతులకు ఆదాయ భద్రత కల్పించే వ్యవసాయాన్ని ప్రోత్సహించడం సదస్సు ప్రధాన లక్ష్యమని తెలిపారు. చిరుధాన్యాల సాగు ద్వారా లభించే పోషక, పర్యావరణ, ఆర్థిక ప్రయోజనాలతో పాటు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై పరిశోధకులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, అధ్యాపకులు, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.

సహజ వ్యవసాయం, చిరుధాన్యాల ఆధారిత పంట నమూనాలు, డిజిటల్ బ్రీడింగ్, జన్యు వైవిధ్యం, సుస్థిర పంట ఉత్పత్తి తదితర అంశాలపై నిపుణులతో చర్చించేందుకు ఈ సదస్సు వేదికగా నిలవనుంది. పంటల ఉత్పాదకతను పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఆహార మరియు పోషక భద్రతకు దోహదపడే వినూత్న వ్యవసాయ విధానాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

సదస్సుకు కె. ప్రకాశ్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు; శ్రీమతి బి. సత్య శ్యామల, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, APCNF, విశాఖపట్నం; డా. వై. సంధ్యారాణి, శాస్త్రవేత్త, ARS–విజయనగరం; ఎన్. అనురాధ, సీనియర్ శాస్త్రవేత్త (ప్లాంట్ బ్రీడింగ్), ARS–విజయనగరం; డా. వాన ప్రసాదరావు, శాస్త్రవేత్త–వ్యవసాయ శాస్త్రం, BCT–కొవ్వూరు వనరుల వ్యక్తులుగా పాల్గొని సహజ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు, జన్యు వైవిధ్యం, డిజిటల్ బ్రీడింగ్, సేంద్రియ మరియు సహజ వ్యవసాయ పద్ధతులపై ప్రసంగించనున్నారు.

డా. ఎం. పద్మ సుందరి, సహాయ ఆచార్యులు, వృక్షశాస్త్ర విభాగం, సదస్సు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. డా. ఎ. వీరబ్రహ్మం, విభాగాధిపతి, బయోటెక్నాలజీ విభాగం, మరియు శ్రీ కె. శ్రీను, విభాగాధిపతి, వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విభాగం, కో-కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు.

విద్యార్థులు, యువ పరిశోధకులు సుస్థిర వ్యవసాయ పరిష్కారాలపై దృష్టి సారించేలా ప్రోత్సహించడం, సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానం, శాస్త్రీయ పరిశోధన, ఆధునిక సాంకేతికతలను సమన్వయం చేసి పర్యావరణహితమైన, స్థిరమైన వ్యవసాయ భవిష్యత్తుకు బాటలు వేయడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...