. K.V.SHARMA EDITOR
విశాఖపట్నం, ఆగస్టు 7:_ నియోజకవర్గంలో "ఇంటింటికి తెలుగుదేశం" మందకొడిగా జరగడం పట్ల భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం 12 క్లస్టర్ల నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో భీమిలికి ప్రత్యేక స్థానముందని, అలాంటిది ఇంటింటి ప్రచారంలో నిరాజనకంగా పని చేస్తున్నారని ఆవేదన చెందారు. గతంలో లక్షకు పైగా సభ్యత్వాలతో రాష్ట్రంలో టాప్ టెన్ లో నిలిచిన నియోజకవర్గం ఈ కార్యక్రమంలో బాగా వెనకబడిందన్నారు. భవిష్యత్ లో నామినేటెడ్ పదవులు, స్థానిక ఎన్నికల్లో ఎంపికకు పార్టీ కార్యక్రమాలే కొలమానంగా పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఇంటింటి ప్రచారంలో కూడా భీమిలి ఎ గ్రేడ్ లో ఉండాలని, ఆ దిశగా అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 15 నాటికి కనీసం 50 శాతం ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, గాడు వెంకటప్పడు, సరగడ అప్పారావు, కసిరెడ్డి దామోదరరావు, మీసాల సత్యనారాయణ, మొల్లి లక్ష్మణరావు, నాగోతి సత్యనారాయణ, మాన్యాల సోంబాబు, గరే గుర్నాథ్, పిల్లా వెంకట్రావు, గంటా నూకరాజు, గాడు చిన్ని కుమారి లక్ష్మి, పీవీ నరసింహం, జానకిరాం, పంచదార్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment