వెస్క్యులర్ వ్యాధులపై అవగాహన ఎంతో అవసరం........ అత్యాధునిక చికిత్సలతో విజయవంతమైన ఫలితాలు సాధిస్తున్నాం: డా. ఎస్.ఎస్. అమరేంద్రబాబు*.....
విశాఖపట్నం, ఆగస్టు 6: నేటి వరల్డ్ వెస్క్యులర్ డే సందర్భంగా విశాఖ వెంకోజీపాలెం కూడలిలోని మెడికవర్ ఆసుపత్రిలో రక్తనాళాల ఆరోగ్యం, రక్త ప్రసరణ, రక్తనాళాల్లో పూడికలు (బ్లాకేజీలు) వంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వెస్క్యులర్ సర్జన్ డా. ఎస్.ఎస్. అమరేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రక్తనాళాల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికీ సరైన అవగాహన ఉండాలని అన్నారు. మెడికవర్ ఆసుపత్రిలో గత ఆరు సంవత్సరాలుగా వెస్క్యులర్ వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో విశిష్ట సేవలు అందిస్తున్నామని తెలిపారు. మానవ శరీరంలో తల నుంచి కాలి బొటనవేలు వరకు రక్తప్రసరణ సక్రమంగా ఉండటం అత్యంత కీలకమని, రక్తనాళాల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వివరించారు. రక్తనాళాల వ్యాధుల చికిత్సకు అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు మెడికవర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సూపర్ గ్లూ ఇంజెక్షన్, లేజర్ సాంకేతికతతో నిర్వహిస్తున్న వేరికోస్ వెయిన్స్ శస్త్రచికిత్సల్లో 99 శాతం విజయవంతమైన ఫలితాలు సాధిస్తున్నామని డా. అమరేంద్రబాబు పేర్కొన్నారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment