Skip to main content

మాజీ శాసన సభ్యులు ముస్తఫాపై , ఆయనతో పాటు ఆయన కుమారుడిని ఆక్రమం అరెస్టు ను ఖండిచిన వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయుకులు*

 


రోజు (05.08.2026) న జిల్లా పార్టీ కార్యాలయం లో మైనారిటీ విభాగం నాయుకులు  పత్రికా సమావేశం జరిగింది.

ఎస్.ఇ.సి సభ్యులు జహీర్ అహ్మద్ గారు మాట్లుడుతూ ... 

ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చలేక ప్రతి పక్షం నాయకులందరినీ కూడా బాధించటం వేధించటం అరెస్టులు చేయటం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా చాలాకాలంగా పొగాకు వ్యాపారం చేస్తున్నారు. పొగాకు కొనుగోలు కోసం సూర్యచంద్రరావు అనే వ్యాపారికి రూ.30 లక్షలు చెల్లించారు. అయితే, డబ్బులు తీసుకున్న సూర్యచంద్రరావు ముస్తఫాకు పొగాకు సరఫరా చేయకుండా దానిని మరో వ్యక్తికి పంపేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ముస్తఫా కుమారుడు.. వేరొకరికి తరలిస్తున్న పొగాకు లారీని పట్టుకుని పెదకాకాని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. డబ్బులు తీసుకుని పొగాకు సరఫరా చేయకపోవడంపై సంబంధిత వ్యక్తులను గుంటూరుకు తీసుకొచ్చి మాట్లాడారు. డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించిన అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. అయితే, ఈ వ్యాపార లావాదేవీల వివాదాన్ని కొందరు వక్రీకరించి 'కిడ్నాప్' గా ప్రచారం చేశారు. అనంతరం ముస్తఫా, ఆయన కుమారుడు, కుటుంబ సభ్యులు, అనుచరులపైనే కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారు. డబ్బులు తీసుకుని పొగాకు సరఫరా చేయకుండా మోసం చేస్తున్నారని భావించిన వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించిందే ముస్తఫా కుటుంబం. నిజంగా కిడ్నాప్ చేయాలనే ఉద్దేశం ఉంటే సంబంధిత వ్యక్తులను పోలీసులకు ఎందుకు అప్పగిస్తారు? ఈ ప్రాథమిక వాస్తవాన్ని దాచిపెట్టి కిడ్నాప్ కథనాలు ప్రచారం చేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమే.  వైయస్సార్సీపీ నాయకులను ఏదో ఒక కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చిన్న వివాదాన్ని కూడా రాజకీయంగా వక్రీకరించి అక్రమ కేసులు బనాయిస్తోంది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు, అనుచరులపై తప్పుడు కేసులు నమోదు చేసింది విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ  విభాగం తరఫున తీవ్రంగా ఖండిసస్తున్నాము. 

జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు బర్కత్ అలీ గారు మాట్లాడుతూ...

మైనార్టీ నాయకుడు ముస్తఫాపై నమోదు చేసిన కిడ్నాప్ కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమేనని జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు బర్కత్ అలీ ఆరోపించారు. న్యాయం కోసం బాధితుడిగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ముస్తఫాపైనే కేసు నమోదు చేయడం రాష్ట్రంలో అమలవుతున్న "రెడ్ బుక్ రాజ్యాంగం"కు నిదర్శనమని విమర్శించారు. కాజా టోల్ ప్లాజా, కాకాని పోలీస్ స్టేషన్‌లలోని సీసీటీవీ ఫుటేజీలను ప్రభుత్వం బహిర్గతం చేస్తే అసలు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని సవాల్ విసిరారు. సాధారణ పొగాకు వ్యాపార లావాదేవీలకు రాజకీయ రంగు పులిమి తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించి చట్టపరంగా పోరాటం కొనసాగిస్తామని, నిజాలు బయటకు వచ్చే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. రాజకీయ కుట్రకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో గత రెండున్నర సంవత్సరాలుగా ముస్లిం సమాజాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని వేధింపులు జరుగుతున్నాయని బర్కత్ అలీ ఆరోపించారు. ముఖ్యంగా ముస్తఫాను టార్గెట్ చేసి రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే వక్ఫ్ బోర్డు వంటి అంశాల్లో కూడా ముస్లింల హక్కులకు భంగం కలిగే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు. భయపెట్టి ముస్లిం నాయకులు, ప్రజలు ప్రతిపక్ష పార్టీలతో ఉండకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి రాజకీయ కుట్రలకు ముస్లిం సమాజం భయపడదని, ప్రజాస్వామ్యబద్ధంగా మరియు చట్టపరంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

జిల్లా షేక్ విభాగం అధ్యక్షులు ఎం.డి. షరీఫ్ గారు మాట్లాడుతూ...

మైనార్టీ నాయకుడు ముస్తఫాపై నమోదైన కేసు, ఆయనతో పాటు ఆయన కుమారుడిని అరెస్టు చేయడం అత్యంత బాధాకరమైన విషయం. ఎలాంటి సమగ్ర విచారణ లేకుండానే ఒక మాజీ ప్రజాప్రతినిధి చేసిన ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు. ముస్తఫా ఒక మంచి వ్యక్తి అని, వాస్తవాలు వెలుగులోకి రాకముందే ఆయనపై నిందలు మోపి అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. అలాగే ఆయన కుమారుడిని కూడా ఈ కేసులో అరెస్టు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన చర్య అని అన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, పూర్తి స్థాయి విచారణ అనంతరం మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్దోషులపై వేధింపులు ఆపాలని, బాధ్యులపై మాత్రమే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు .డి. షరీఫ్ తెలిపారు,

ఈ సమావేశంలో విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం ఆర్ టి ఐ విభాగం అధ్యక్షులు ఎస్ కే బాబ్జి పాల్గొన్నారు .

                    K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...