. K.V.SHARMA EDITOR
ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఆగష్టు18ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలలోలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఉన్నత విద్య కమీషనర్ సూచనల మేరకు మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బందిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా విశ్వవిద్యాలయంలోని ఆయా విభాగాల్లో ప్రతిజ్ఞ చేసినట్లు నిర్వహించినట్లు కార్యక్రమ సమన్వయకర్త, విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ ఆచార్య హరనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు, వాటి వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో ఆచార్యులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొని నషా ముక్త్ భారత్ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా విద్యా సంస్థల స్థాయిలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వివరించారు.కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్, ప్రిన్సిపాల్స్, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.చిట్టిబాబు, ఆర్.పద్మశ్రీ, విభాగాధిపతులు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు

Comments
Post a Comment