విశాఖపట్టణం కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం లో శ్రావణమాసం పురస్కరించుకుని ఈనెల13 నుంచి సెప్టెంబర్ 11వ తేది వరకు ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ సంఘ అధ్యక్షులు ఆరిశెట్టిదినకర్, కార్యదర్శి పెనుగొండ వెంకట కామరాజు ఒక ప్రకటన లో తెలిపారు.
కన్యకాపరమేశ్వరి అలయం పునర్నిర్మాణంలో వున్నందున నూతనంగా నిర్మించి ప్రతిష్టించిన బాలాలయంలో శ్రావణమాసంలో వచ్చే ఐదు శుక్రవారాల్లో అమ్మవారికి ప్రాతఃకాల ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, మహిళలచే సామూహిక లలితాసహశ్రనామ స్తోత్రపారాయణమలు, సామూహిక లక్ష సహశ్ర కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం నాడు ఆలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ప్రముఖ వర్తకులు శ్రీ బద్రినారాయణ- ఉమామహేశ్వరి దంపతులు కార్యక్రమ కరపత్రం విడుదల జేశారు.
ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రావణమాసం మొదటి శుక్రవారం 14వ తేది నాడు అమ్మవారికి రజిత వస్త్రాలంకరణ మరియు 108 స్వర్ణపుష్పార్చన, మహిళలచే సామూహిక లలితా సహస్రనామ పారాయణం, సామూహిక లక్షకుంకుమార్చన, రెండవ శుక్ర వారం ఆగష్టు 21వ తేది నాడు అమ్మవారికి పట్టువస్త్రాలంకరణ మరియు మహిళలచే సామూహికంగా లలితాసహశ్రనామ పారాయణ, లక్ష కుంకుమార్చన; మూడవ శుక్రవారం ఆగష్టు 28వ తేది నాడు అమ్మవారికి పుష్పవస్త్రాలంకరణ, మరియు మహిళలచే సామూహికంగా లలితాసహశ్రనామ పారాయణ, సామూహిక లక్ష కుంకుమార్చన, నాల్గవ శుక్రవారం సెప్టెంబర్ 4వ తేది నాడు అమ్మవారికి హరిద్రవస్త్రాలంకరణ, మహిళలచే సామూహిక పారాయణములు, లక్షకుంకుమార్చన, ఐదవ శుక్రవారం సెప్టెంబర్ 11వ తేది నాడు శ్రీమహాలక్ష్మి దేవికి పసుపునీళ్ళతో అభిషేకం మరియు సెప్టెంబర్ 4వ తేదినాడు భారీ స్ధాయిలో నారాయణ సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.శ్రావణమాసంలో వచ్చే ఐదు శుక్రవారాలలోనూ నిర్వహించే సామూహికకుంకుమ పూజలకు సంబంధించి పూజా సామగ్రి యావత్తూ దేవస్థానంవారు ఉచితంగా ఏ విధమైన రుసుం తీసుకోకుండా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ఆర్య వైశ్యులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికృపకు పాత్రులు కమ్మని కోరారు.

Comments
Post a Comment