పాఠశాలలో ఆధార్ అప్డేట్ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి మెహబూబ్ బాష..... తప్పనిసరిగా విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి.....
. SRINIVAS SPL Correspondant
అమలాపురం:విశాఖ సందేసం :డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న విద్యార్థులకు ఆధార్ అప్డేట్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి మెహబూబ్ బాష పరిశీలించారు. విద్యాశాఖ అధికారి బాష మాట్లాడుతూ జిల్లాలోని కొంతమంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆధార్ అప్డేట్ లేదని గుర్తించిన ప్రభుత్వం జిల్లా 11 ఉన్నత పాఠశాలలో ఆధార్ అప్డేట్ కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేది వరకు ఉంటుందని పాఠశాలల విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పలు సంక్షేమ పధకాలు ఆధార్ తో అనుసంధానం ఉండడం వలన ఆధార్ అప్డేట్ కాని విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి పాఠశాలలో నిర్వహిస్తున్న ఆధార్ అప్డేడ్ కార్యక్రమం ద్వారా తమ పిల్లల ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని మెహబూబ్ బాష సూచించారు.
క్రీడాల్లో రాణిస్తూ పలు రికార్డులను సొంతం చేసుకున్న పాఠశాల విద్యార్థులు అవినాష్, అభిషేక్ లకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డివై ఈవో డి. కిషోర్, ఎమ్.ఈ.ఓ గుబ్బల సూర్యప్రకాష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ అలీ పాల్గొన్నారు

Comments
Post a Comment