Skip to main content

మెడికవర్ హాస్పిటల్స్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలు ఘనంగా నిర్వహణ


Vizag, ఆగస్ట్ 5, 2026: ప్రతి సంవత్సరం ఆగస్ట్ మొదటి వారం ప్రపంచ  బ్రెస్ట్ ఫీడింగ్ వారంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా మెడికవర్ హాస్పిటల్స్‌ లో ఆగస్ట్ 1 నుండి 7వ తేదీ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ వారోత్సవాల్లో తల్లిపాలలోని పోషక విలువలు, శిశువు ఆరోగ్య అభివృద్ధిపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించే అనేక కార్యక్రమాలు నిర్వహించారు. నర్సులు, రెసిడెంట్ డాక్టర్ల కోసం క్విజ్ పోటీలు, పోస్టర్ ప్రదర్శనలు, విద్యా కార్యక్రమాలు, బ్రెస్ట్ ఫీడింగ్ సమస్యలపై మినీ వర్క్‌షాపులు నిర్వహించబడ్డాయి.

డా. సాయి సునీల్ కిషోర్, డా. విజయ్, డా. మౌనికా, డా. ప్రియాంక , సెంటర్ హెడ్ డా.  శ్రీకాంత్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి తమ ప్రసంగాలతో తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. డా. సాయి సునీల్ కిషోర్ నియోనాటాలజిస్టు & పీడియాట్రిక్ స్పెషలిస్టు మాట్లాడుతూ, "తల్లిపాలు శిశువుకు మొదటి టీకా లాంటివి. శిశువు ఆరోగ్యానికి, రోగనిరోధకశక్తి పెరుగుదలకు ఇవి మేలైన ఆధారం. ప్రతి తల్లి వీటిని ఇచ్చేందుకు చురుకుగా ఉండాలి" అని అన్నారు. డా. ప్రియాంక మాట్లాడుతూ,"తల్లిపాలు తల్లికి, బిడ్డకు శారీరకంగా, మానసికంగా లాభం కలిగిస్తాయి. ఈ ప్రక్రియ ఒక సహజమైన బంధాన్ని ఏర్పరచుతుంది. ప్రతి తల్లి దీన్ని ప్రోత్సహించాలి" అని అన్నారు. 

మెడికవర్ హాస్పిటల్స్ ఈ కార్యక్రమం ద్వారా తల్లుల్లో ఆత్మవిశ్వాసం, అవగాహన పెంచే దిశగా మరొక ముందడుగు వేసింది. వైద్యులు, నర్సింగ్ తల్లులు మరియు ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమములో  పాల్గొన్నారు.

                   K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...