SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం పట్టణంలో రోడ్డుకి ఇరువైపులా ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన దొమ్మేటి వెంకటరెడ్డి, కుడిపూడి చిట్టబ్బాయి విగ్రహాలు తొలగించాలని హై కోర్ట్ ను బొంతు రమణ ఆశ్రయించడం జరిగింది. దీనిపై స్పందించిన గౌరవ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కోరింది దీనిపై జిల్లా కలెక్టర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అనుమతి లేని విగ్రహాలను తక్షణం తొలగించాలని బొంతు రమణ డిమాండ్ చేశారు
అమలాపురం పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే హై స్కూల్ సెంటర్లో ట్రాఫిక్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన దొమ్మేటి వెంకటరెడ్డి, కుడిపూడి చిట్టబ్బాయి విగ్రహాలు తొలగించాలని 2024లో అప్పటి కలెక్టర్ హిమాన్షు శుక్లాకు స్పందనలో ఫిర్యాదు చేయగా వాటికి ఎటువంటి అనుమతి తాను ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయినా తొలగించకపోవడంతో ప్రజా ప్రయోజనార్థం హైకోర్టుని ఆశ్రయించడం జరిగిందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగజేస్తున్న ఈ రెండు విగ్రహాలను తక్షణమే తొలగించాలని బొంతు రమణ డిమాండ్ చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Comments
Post a Comment