Skip to main content

తోతాపురి మామిడి రైతులకు మద్దతు ధర అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం* *లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నతో వెల్లడైన వాస్తవాలు*

.                     K.V.SHARMA EDITOR 
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తోతాపురి  మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ధరల సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బహిర్గతం చేసిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన మార్కెట్ జోక్యం, కొనుగోలు వ్యవస్థను అమలు చేయకపోవడంతో రైతులకు క్షేత్రస్థాయిలో కిలోకు కేవలం రూ.3 నుంచి రూ.6 వరకు మాత్రమే ధర లభించిందని తెలిపారు. *తోతాపురి  రైతుల సమస్యలపై ఎంపీ గురుమూర్తి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.* 2026–27 మార్కెటింగ్ సీజన్‌లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు.

ఈ కొనుగోళ్లకు కిలోకు రూ.17.47 మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, కేంద్రం నిర్ణయించిన ధరకు, రైతులకు వాస్తవంగా లభించిన రూ.3–6 ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఎంపీ అన్నారు. జూలై 4న చిత్తూరు మార్కెట్‌లో తోతాపురి  ధర రూ.3 నుంచి రూ.6 వరకు నమోదైందని, జూన్‌లో రైతులు కిలోకు కేవలం రూ.4కే పంటను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద వందలాది ట్రాక్టర్లు రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో తోతాపురి  మామిడికి కిలోకు రూ.12 వరకు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, ఆ ధర రైతులకు అందలేదని గురుమూర్తి విమర్శించారు. “ప్రభుత్వం ప్రకటించిన ధర ఒకవైపు.. రైతుకు వాస్తవంగా దక్కిన ధర మరోవైపు” అన్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ మార్కెట్ నిర్వహణలోని లోపాలను స్పష్టంగా చూపిస్తోందన్నారు.


అదేవిధంగా, తోతాపురి  రైతులకు శాశ్వత పరిష్కారం కోసం తిరుపతిలో జాతీయ మామిడి బోర్డు, చిత్తూరులో జాతీయ మామిడి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని తాను లోక్‌సభలో ప్రశ్నించానని తెలిపారు. అయితే ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ కేంద్ర వ్యవసాయ శాఖ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. మామిడి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పాత తోటల పునరుద్ధరణ, మెరుగైన రకాల సాగు, పంట అనంతర నిర్వహణ, నిల్వ, ప్రాసెసింగ్, ఎగుమతుల ప్రోత్సాహం వంటి చర్యలను నిపుణుల కమిటీ సిఫారసు చేసిందని ఎంపీ తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో టాప్-వర్కింగ్ తోటల అభివృద్ధి కోసం రైతుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ఉద్యాన శాఖ ఇప్పటికే పూర్తి చేసినట్లు కేంద్రం తెలిపిందన్నారు. ప్రకటించిన ధర రైతులకు క్షేత్రస్థాయిలో అందేలా సమర్థవంతమైన కొనుగోలు వ్యవస్థను ఏర్పాటు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ధరల సంక్షోభం పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...