Skip to main content

విశాఖ జిల్లా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ అభిషిక్త్ కిషోర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శంఖ బ్రత భాగ్చి జాయింట్ కలెక్టర్ శ్రీమతి విద్యాధరి , జిల్లా అధికారులు, పోలీసు శాఖ అధికారులు మరియు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారుల సమక్షంలో విశాఖ జిల్లాకు నూతనంగా వచ్చిన రెండు ఎలక్ట్రిక్ బస్సులను రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీభరత్ ప్రారంభించారు.


అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎలక్ట్రిక్ బస్సులను అతి త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చినందుకు మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులను, సిబ్బందిని అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఏడాది ఆగస్టు 15న విశాఖ జిల్లాలో శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇప్పటివరకు విశాఖ జిల్లాలో సుమారు రూ.230 కోట్ల విలువైన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో మహిళా ప్రయాణికులు విశాఖ జిల్లాలో ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారని, వారి ప్రయాణ శాతం గణనీయంగా పెరగడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా రీజినల్ మేనేజర్‌ శ్రీ బి.అప్పల నాయుడు తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బందిని అభినందించారు.


అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 20 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో 10 బస్సులు గాజువాక నుంచి NAD–మద్దిలపాలెం హైవే మీదుగా, మరో 10 బస్సులు సంధ్య థియేటర్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఐటీ పార్క్ తదితర ప్రాంతాల మీదుగా నడుస్తున్నాయని తెలిపారు. గాజువాక నుంచి, విమానాశ్రయం నుంచి కూడా ప్రతి గంటకు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని వివరించారు.

విమానాశ్రయానికి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రూ.300, గాజువాక నుంచి రూ.400 మాత్రమే ఛార్జీగా నిర్ణయించామని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, ఎంపీ శ్రీ శ్రీభరత్ గారు కోరారు.


అనంతరం ప్రారంభించిన ఎలక్ట్రిక్ బస్సుల్లో మంత్రివర్యులు, ఎంపీ శ్రీ శ్రీభరత్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ అభిషిక్త్ కిషోర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శంఖ బ్రత భాగ్చి గారు, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు మరియు ఆర్టీసీ అధికారులు ప్రయాణించి పోలీస్ గ్రౌండ్స్ నుంచి ఆర్కే బీచ్ వరకు బస్సు ప్రయాణాన్ని నిర్వహించారు.

పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులు విశాఖ నగర ప్రజలకు, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, చౌకైన ప్రజా రవాణా సేవలను అందించనున్నాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...