Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. * భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం గా కొండపై రెండో రోజు ప్రత్యేక పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ డ్రైవ్ * ఫ్రీ క్యూ లైన్లు, వాష్‌రూమ్‌లు, తాగునీటి వసతులు, అన్నదానం–లడ్డూ ప్రసాదాల నాణ్యతపై ఈవో జల్లేపల్లి వెంకట్రావు ప్రత్యేక పరిశీలన.

 


సింహాచలం, 12 ఆగస్టు 2026:శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ ఈవో జల్లాపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో కొండపై రెండో రోజు ప్రత్యేక పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ డ్రైవ్ నిర్వహించారు. 


సానిటరీ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఈవో, భక్తుల సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, క్యూ లైన్లు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.



ముఖ్యంగా ఫ్రీ క్యూ లైన్లను పరిశీలించిన ఈవో, క్యూ లైన్లకు ఆనుకుని ఉన్న వాష్‌రూమ్‌లను స్వయంగా పరిశీలించారు. వాష్‌రూమ్‌లలో క్లీనింగ్, తలుపులు, గడియలు తదితర వాటిని సరిచేయడంతో పాటు అవసరమైన చిన్నచిన్న మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


వాష్‌రూమ్‌ల వద్ద భక్తులకు స్పష్టంగా కనిపించే విధంగా అవసరమైన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.

క్యూ లైన్లకు ఆనుకుని ఉన్న వాటర్ కూలర్లను ఈవో పరిశీలించారు. కొత్తగా కొనుగోలు చేసిన వాటర్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి, వాటిని తక్షణమే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత వాటర్ ఏఈని ఆదేశించారు.



ఉచిత ప్రసాదాల పంపిణీ కేంద్రం, వేద పాఠశాల, కేశఖండనశాల తదితర భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా అవసరమైన వాటర్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.


భక్తులకు తాగునీరు అందించే స్టీల్ డ్రమ్ములను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ప్రతిరోజూ శుభ్రపరిచిన వివరాలను నమోదు చేసే విధంగా ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించాలని వాటర్ ఏఈని ఆదేశించారు.


ఆలయ పరిసరాల్లో పేరుకుపోయిన అనవసర, వినియోగంలో లేని వస్తువులను వెంటనే తొలగించి, వాటిని స్క్రాప్‌కు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలు ఎక్కడా అపరిశుభ్రంగా కనిపించకుండా నిరంతరం పర్యవేక్షించాలని సానిటరీ సిబ్బందికి సూచించారు.


అన్నదానం భవనానికి సమీపంలోని వాష్‌రూమ్‌లను ఈవో స్వయంగా లోపలికి వెళ్లి పరిశీలించారు. అక్కడ కొత్త బకెట్లు, జగ్గులు ఏర్పాటు చేయడంతో పాటు వాష్‌రూమ్‌లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


అన్నదానం భవనం చుట్టుపక్కల ఉన్న సిమెంట్, ఇటుకలు, పనికిరాని ఇతర వస్తువులను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సానిటరీ సిబ్బందికి సూచించారు.



అన్నప్రసాదం నాణ్యతపై స్వయంగా పరిశీలనఅన్నదానం భవనంలో భక్తులకు అందిస్తున్న స్వామివారి అన్నప్రసాదాన్ని ఈవో పరిశీలించారు. అక్కడ తయారు చేసిన టమాటా పచ్చడి, అరటికాయ కూర, పప్పు, ఆకుకూర, సాంబారు తదితర పదార్థాలను స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు.


అక్కడ భోజనం చేస్తున్న భక్తులను అన్నప్రసాదం నాణ్యతపై అడిగి తెలుసుకోగా, అన్నప్రసాదం రుచికరంగా, బాగుందని భక్తులు పేర్కొన్నారు. దీంతో ఈవో సంతృప్తి, ఆనందం వ్యక్తం చేశారు.


స్వామివారి నివేదనకు, అన్నప్రసాదానికి ఉపయోగించే నిత్యావసర సరుకుల స్టోర్‌ను కూడా ఈవో పరిశీలించారు. అన్నదానం భవనంలో చేపట్టాల్సిన అదనపు పనులపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబుతో చర్చించారు.


అన్నప్రసాదం తయారీ, పంపిణీ ప్రాంతం మొత్తం హైజీనిక్ పద్ధతుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫస్ట్ ఎయిడ్ కిట్లను వెంటనే ఏర్పాటు చేయాలని, సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని అన్ని పైప్‌లైన్లను సేఫ్టీ పరంగా పరిశీలించి అవసరమైన సర్వీసింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


లడ్డూ ప్రసాదం నాణ్యతపై ప్రత్యేక తనిఖీ

అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదం తయారు చేసే విభాగాన్ని ఈవో పరిశీలించారు. ప్రసాదం తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పరిశీలించడంతో పాటు ప్రసాదం నాణ్యతను స్వయంగా రుచి చూసి తనిఖీ చేశారు. నాణ్యత ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకుండా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు.


ఈవో జల్లాపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, భక్తుల సౌకర్యాలే ప్రథమ ప్రాధాన్యత గా సింహాచల క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడికి పరిశుభ్రమైన వాతావరణం, స్వచ్ఛమైన తాగునీరు, సౌకర్యవంతమైన క్యూ లైన్లు, నాణ్యమైన అన్నప్రసాదం అందించడమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని తెలిపారు. భక్తుల నుంచి వచ్చే సూచనలు, సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


ఈ ప్రత్యేక తనిఖీల్లో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్‌చార్జి రామరాజు, తాతాజీ ఏఈఓ, వాడ్రేవు రమణమూర్తి, కె. తిరుమలేశ్వరరావు, పిల్లా శ్రీనివాస్, పర్యవేక్షణ అధికారి రాజ్యలక్ష్మి, పాలూరు నర్సింగరావు, ఇంజనీరింగ్ సిబ్బంది తిరుపతిరావు, రవిరాజ్, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

                     K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...