ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
గతంలో గుజరాత్ పర్యాటక రంగానికి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన తరహాలోనే, ఏపీ ఇమేజ్, టూరిజం ప్రమోషన్ కోసం చిరంజీవిని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం, పెట్టుబడులు , పర్యాటకాన్ని ఆకర్షించడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనపై ప్రాథమిక సంప్రదింపులు పూర్తయినట్లు సమాచారం.
ఈ భాగస్వామ్యానికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది..
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment