ఎలమంచిలి నియోజకవర్గంలో కూటమి నాయకులు చేస్తున్న అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సాక్షి మీడియా బృందాన్ని కూటమి నాయకులు అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరమని జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కెకె రాజు తీవ్రంగా ఖండించారు.*
అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించడానికి వీల్లేదంటూ సాక్షి బృందాన్ని అడ్డుకోవడమే కాకుండా, అక్కడి పరిస్థితులను వీడియో చిత్రీకరిస్తే అక్రమ కేసులు నమోదు చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బెదిరింపులకు లొంగకుండా తమ విధి నిర్వహణలో భాగంగా నిజాలను నమోదు చేయడానికి ప్రయత్నించిన సాక్షి బృందాన్ని అడ్డుకోవడం, వారిపై ఒత్తిడి తీసుకురావడం, అక్రమ కేసులు పెడతామని హెచ్చరించడం ఏమాత్రం సమర్థనీయం కాదని కెకె రాజు అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛగా వార్తలను సేకరించి ప్రజలకు చేరవేసే హక్కు ఉందని, మీడియాపై దాడులు, బెదిరింపులు, అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి, సాక్షి బృందాన్ని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ మైనింగ్ ఆరోపణలపై సమగ్ర విచారణ నిర్వహించి నిజాలను ప్రజల ముందుంచాలని జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కెకె రాజు డిమాండ్ చేశారు.

Comments
Post a Comment