. SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం...అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ పరామర్శించి, వారికి భరోసా కల్పించారు.
ఓడలరేవు గ్రామానికి చెందిన కోపనాతి రామకృష్ణవర్మతో పాటు మరో ఆరుగురు మత్స్యకారులు ఆగస్టు 3న టోనా ఫిష్ వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. ఆగస్టు 12న తిరిగి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు వారి ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించిన అనురాధ , మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వం వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేసేలా ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ను కలిసి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతామని చింతా అనురాధ తెలిపారు. గ్రామస్తుల ద్వారా నిత్యావసర సరుకులు పంపించి పంపిణీ చేయించారు. ఈ కార్యక్రమంలో కొనుకు గౌతమి, ఇళ్ల శేషారావు, కొనుకు బాపూజీ, మల్లాడి ఉమా మహేశ్వరరావు , తారాడి శివ,చిలకలపూడి రాజు, శ్రీను,పాలేపు లక్ష్మణ్,రేవు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment