Skip to main content

సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల లో కృత్రిమ మేధస్సుపై మూడు రోజుల అధ్యాపక శిక్షణా కార్యక్రమం ప్రారంభం

 


విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని:సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల లో ఆంధ్ర విశ్వవిద్యాలయం సహకారంతో “కృత్రిమ మేధస్సు ద్వారా అధ్యాపకులు, పరిశోధకుల సాధికారత – అంతరశాఖల అధ్యయనం” అనే అంశంపై మూడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (FDP) బుధవారం కళాశాల సెమినార్ హాల్‌లో ప్రారంభమైందని కన్వీనర్ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి శ్రీమతి కె. నాగ శిరీష తెలిపారు 


ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు–RUSA 2.0లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకులు, పరిశోధకులు కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్, డేటా ఆధారిత సాంకేతికతలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, వాటిని బోధన, అభ్యాసం, పరిశోధనలో సమర్థవంతంగా వినియోగించే అవకాశాన్ని కల్పిస్తోంది.


ప్రారంభ సమావేశానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాశాల అభివృద్ధి మండలి (CDC) డీన్ ప్రొఫెసర్ టి.వి. కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. ఉన్నత విద్యా రంగంలో కృత్రిమ మేధస్సు విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందని, అధ్యాపకులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని బోధన, పరిశోధనలో సమర్థవంతంగా వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి. మరియు వైస్ ప్రిన్సిపాల్ డా. సిస్టర్ ఎస్. హేమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి శ్రీమతి కె. నాగ శిరీష కన్వీనర్‌గా వ్యవహరించారు.


గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన డా. కింతలి మనోహర్, గాయత్రి విద్యా పరిషత్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన డా. ఎస్. కాంతి కిరణ్, అనిల్ నీరుకొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (ANITS)కు చెందిన డా. దాసరి నాగతేజ్ రిసోర్స్ పర్సన్స్‌గా పాల్గొని కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, ఆధునిక సాంకేతిక అనువర్తనాలపై అధ్యాపకులకు శిక్షణ అందించారు.


మొత్తం 30 మంది అధ్యాపకులు, విద్యావేత్తలు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల తరఫున కె. నాగ శిరీష, జి. దీప్తి, ఎస్. మాధురి, కుమ్‌కుమ్ ధారా, శ్రీమతి జె. అనితా రాణి, కె. ఎస్తేర్ లిల్లీ, టి. సుసాన్ సలోమి, శ్రీ ఎం. సందీప్ పాల్గొన్నారు.

ఈ మూడు రోజుల శిక్షణా కార్యక్రమం అధ్యాపకుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, కృత్రిమ మేధస్సు ఆధారిత బోధన, పరిశోధన, ఆవిష్కరణలకు కొత్త దిశను చూపనుందని నిర్వాహకులు తెలిపారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...