K.V.SHARMA EDITOR
ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆగష్టు 19 : ఆంధ్ర విశ్వవిద్యాలయం, రాజనీతి శాస్త్ర మరియు పరిపాలన విభాగం విద్యార్థులు విభాగాధిపతి ఆచార్య పేటేటి. ప్రేమానందం ఆధ్వర్యంలో ఇటీవల గౌరవ శాసనసభ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపుమేరకు నేడు అసెంబ్లీ సమావేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆచార్య పేటేటి. ప్రేమానందం మాట్లాడుతూ సాధారణంగా రాజనీతి శాస్త్రము మరియు పరిపాలనా శాస్త్రంలో రాష్ట్ర రాజకీయాలు మరియు శాసనసభలు అనే అంశాన్ని పాఠాలుగా బోధిస్తూ ఉంటాంమని, ఆ పాఠాలనే నేడు విద్యార్థిని విద్యార్థులకు అనుభవ పూర్వక విజ్ఞానాన్ని అందజేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసి ఆచార్య జి.పి. రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, రెక్టార్ పులిపాటి కింగ్ మరియు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జాలాద రవి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని అన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు సుమారు 35 నిమిషాల పాటు శాసనసభ సమావేశాలను వీక్షించి, ఒక కొత్త అనుభూతిని పొందారు. ఈ కార్యక్రమంలో భాగంగా విభాగాధిపతి పేటేటి ప్రేమానందం గౌరవ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని సన్మానించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ (విశాఖ దక్షిణనియోజకవర్గం ఎమ్మెల్యే) మరియు సోము వీర్రాజు లు విద్యార్థులకు ఉపయుక్తంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసారని ఆచార్య ప్రేమానందం తెలిపారు.
ఈ కార్యక్రమంలో విభాగం సహాయక ఆచార్యులు డాక్టర్ కె.సత్యన్నారాయణ, విభాగ అధ్యాపకులు డాక్టర్ టి నాగరాజు, డాక్టర్ జి.ప్రియాంక మరియు 30 మంది విద్యార్థుని విద్యార్థులు పాల్గొన్నారు.
ఆచార్య పేటేటి ప్రేమానందం
విభాగాధిపతి

Comments
Post a Comment