. D.S.Varma Sr Sub EDITOR
విశాఖపట్నం: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విశాఖలోని ఎన్.ఎ.డి (NAD) ప్రాంతంలో ఉన్న చేనేత కుటుంబాలను బిజెపి జిల్లా అధ్యక్షుడు పరశురామ రాజు నేరుగా సందర్శించారు. కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారు స్వయంగా తయారుచేస్తున్న వైవిధ్యభరితమైన వస్త్రాలను, వారి అద్భుతమైన చేనేత నైపుణ్యాన్ని స్వయంగా పరిశీలించి, వారి ప్రతిభను అభినందించారు.
ఈ సందర్భంగా పరశురామ రాజు మాట్లాడుతూ, మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చేనేత కళను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. చేనేత రంగాభివృద్ధికి మరియు నేతన్నల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను కార్మికులకు సమగ్రంగా వివరించారు. అనంతరం చేనేత కార్మికులను శాలువాలతో ఘనంగా సత్కరించి గౌరవించారు.
చేనేత రంగానికి, నేతన్నలకు ప్రత్యక్షంగా అండగా నిలిచేందుకు ప్రతీ బిజెపి నాయకుడు, కార్యకర్త వారంలో కనీసం ఒకరోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డాడీ రమేష్,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్,సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్, వలిరెడ్డి శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments
Post a Comment