ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులతో సమావేశమైన ఎంపీ హరీష్ మాధుర్ ఓడలరేవు సముద్ర తీరంలో గల్లంతైన మత్స్యకారుల గాలింపు చర్యలు మరింత వేగవంతం చేయాలని కోరిన ఎంపి …
. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు సముద్రంలో బోటుపై వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కూటమి ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టిందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి తెలిపారు. గాలింపు చర్యలు మరింత వేగవంతం చేయాలని కాకినాడలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులను ఎంపీ కలసి కోరారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను వీలైనంత త్వరగా గుర్తించేందుకు ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు ఇతర బృందాల ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. వీలైనంత త్వరగా గల్లంతైన మత్స్యకారులను గుర్తించి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.

Comments
Post a Comment