. Dr Nanduri Ramakrishna Sr Sub EDITOR
విశాఖపట్నం :విశాఖ సందేశం వర్తవాహని :ఆగస్టు 12, 2026: గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ (అటానమస్), ఎమ్.వి.పి. శాఖ లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (ఫీల్డ్ ఆఫీస్–విశాఖపట్నం) ఆధ్వర్యంలో, కళాశాల సహకారంతో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా సమగ్ర సమాచార, అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల యూజీ కోర్సుల డైరెక్టర్ శ్రీ డి. గిరిధర్ మాట్లాడుతూ, విద్యార్థి దశలో మంచి అలవాట్లు, సానుకూల ఆలోచనా విధానం, క్రమశిక్షణ ఎంతో అవసరమని అన్నారు. యువత తమ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించి, విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ బి. రుత్విక్, IRS, ఆదాయపు పన్నుల శాఖ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. మాదకద్రవ్యాలకు బానిసైన వ్యక్తి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు, సామాజిక జీవితం వంటి అనేక రంగాల్లో నష్టపోతారని వివరించారు.
కళాశాలపీఆర్వోశ్రీమతిశేషపద్మమాట్లాడుతూమాదకద్రవ్యాల ప్రభావానికి లోనుకాకుండా యువత అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా III టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ భావ్య పాల్గొని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే సామాజిక, చట్టపరమైన పరిణామాలను వివరించారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీ కందాల శ్రీరామమూర్తి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విస్తృత అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కుటుంబ వ్యవస్థను, సామాజిక విలువలను ప్రభావితం చేస్తుందని అన్నారు. యువత మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు.
.అనంతరం విద్యార్థులతో ‘నషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ డి. దక్షిణామూర్తి, కళాశాల డైరెక్టర్ శ్రీ డి. గిరిధర్, పీఆర్వో శ్రీమతి శేష పద్మలను, ముఖ్య అతిథి శ్రీ బి. రుత్విక్, IRS మరియు III టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ భావ్య లను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని విజేతలగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరిస్తూ నవరస థియేటర్ ఆర్ట్ అసోసియేషన్ కళాకారులు ప్రదర్శించిన డ్రగ్ అవేర్‌నెస్ స్కిట్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో హిందీ విభాగానికి చెందిన డా. అనిత, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన డా. శ్యామల, ఆంగ్ల విభాగాధిపతి డా. విజయలక్ష్మి, శ్రీ కె. కృష్ణ కుమార్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

Comments
Post a Comment