Skip to main content

రామాలయం వీధిలో వినాయక చవితి పండుగ నిర్వహించుకునేందుకు అనేక అడ్డంకులు


రామాలయం వీధిలో వినాయక చవితి పండుగ నిర్వహించుకునేందుకు అనేక అడ్డంకులు కల్పిస్తున్నామని అవాస్తవాలు మాట్లాడటం సబబు కాదు అని జీవీఎంసీ 27 వ వార్డు టీడీపీ అధ్యక్షుడు,శ్రీ ఎరుకమాంబ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి సత్యనారాయణరెడ్డి తెలిపారు.వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ గోలగాని వీరరావు (బుజ్జి) ఇతర వార్డు నాయకులతో కలిసి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రామాలయం వీధిలో స్థానిక వైసీపీ నాయకుడు సర్వేశ్వర రెడ్డి ఎంతోకాలంగా తాము పెట్టిన ఫ్లెక్సీలపై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో బురదజల్లుతున్నారని ఆరోపించారు.రామాలయం వీధిలో ప్రతీ ఏటా నిర్వహించే వినాయకచవితి వేడుకలకు తాము ఎటువంటి అవరోధాలు కల్పించలేదని తెలిపారు. వినాయకుని విగ్రహం ఏర్పాటుచేసే సమయానికి తమ ఫ్లెక్సీలు తొలగిస్తామని చెప్పినా సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సత్యనారాయణ రెడ్డి మండిపడ్డారు.వార్డుప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా వినాయకుని మండపం పేరుతో  రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.హిందువులు భక్తిశ్రద్దలతో జరుపుకునే వినాయక చవితికి తాము అడ్డుపడుతున్నామని సోషల్ మీడియాలో అబద్దాలతో ప్రచారంచేస్తున్నారన్నారు. వార్డులో సదరువ్యక్తి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా తాము ఇప్పటివరకు అడ్డుపడలేదన్నారు. అలాగే వార్డులో పదిరోజులు మంచినీరు సరఫరా కాలేదని కూడా అవాస్తవాన్ని సోషల్  మీడియాలో పోస్టులు పెట్టారని గుర్తుచేశారు.తమ సహనాన్ని పరీక్షించవద్దని అధికారంలో ఉన్నప్పుడే తమను ఏమీ చెయ్యలేకపోయారనేది గుర్తుతెచ్చుకోవాలన్నారు. తనను ధర్మకర్తగా ధర్మాన్ని రక్షించాలని నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో తాను లేనని నేను 1998వ సంవత్సరంలోనే ధర్మకర్తల మండలి చైర్మన్ గా పని చేశానని అప్పటికి నువ్వు రాజకీయాల్లో ఓనమాలు కూడా దిద్దలేదంటూ ఎద్దేవా చేశారు.తనతో రాజకీయంగా ఏదైనా వుంటే ధైర్యంగా ఎదుర్కొనాలని తన కుటుంబ సభ్యులు గురించి అవాకులు, చవాకులు మాట్లాడితే తాను  నోరు విప్పి మాట్లాడితే రేపటి నీ రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందని సర్వేశ్వర రెడ్డిని హెచ్చరించారు. ఈ సమావేశంలో 27వ వార్డ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శివప్రసాద్, శ్రీ ఎరుకమాంబ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తలు కెవిఎస్ గురు గోవింద్, మచ్చా కనకారావు, బసనబోయిన సుజాత, కుప్పిలి కుంతీదేవి, టేకుపూడి మంగాదేవి, గనివాడ లక్ష్మీ, శ్రీ రామ మందిరం మరియు పరదేశమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తలు బెహరా ఆశిష్, అలమండ సత్యవతి, అల్లూరి రమాదేవి,  వార్డు నాయకులు గురునాథ రావు, సుగుణ, అచ్చియమ్మ, కనకమహాలక్ష్మి, మజ్జి వెంకట సత్యనారాయణ, గొరుసు గురునాథ్ రెడ్డి, అల్లూరి నాగేంద్ర రెడ్డి, అల్లూరి రామచంద్ర రెడ్డి,  నవీన్, ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...