Skip to main content

పోరాటాలతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం* *చట్టాల సవరణకు త్వరలో జాతీయ సదస్సు* *కూటమి ప్రభుత్వ హయాంలోనే ఇళ్ల స్థలాలు*..*పెన్షన్ సదుపాయం సాధిస్తాం* *జిల్లా మహాసభకు భారీగా తరలివచ్చిన పాత్రికేయులు* *ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు*

శ్రీకాకుళం.ఆగస్టు 18. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు లు అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు సాధించేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా మహాసభకు ముఖ్య అతిథిలు గా పాల్గొన్న వీరు మాట్లాడుతూ. ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న పాత్రికేయుల సంక్షేమంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

జర్నలిస్టులు సమాచారాన్ని స్వేచ్ఛగా సేకరించి ప్రజలకు అందించేందుకు అనుకూలంగా ఉన్న చట్టాలను మరింత పటిష్టంగా సవరించాలని వారు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడంతో పాటు, వారికి మెరుగైన భద్రత, సామాజిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ తదితర సంక్షేమ ప్రయోజనాలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జర్నలిస్టు సంఘాలు ఐక్యంగా పోరాడుతాయని స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలపై చర్చించేందుకు త్వరలో జాతీయస్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం ఫెడరేషన్ నిరంతరం తమ వంతు ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు..పోరాటాల ద్వారానే జర్నలిస్టుల హక్కులు, సంక్షేమాన్ని సాధించగలమని వీరు పేర్కొన్నారు. ఈ సభకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే వేణుగోపాల్ అధ్యక్షత వహించగా ఫెడరేషన్ కార్యదర్శి లక్ష్మణరావు .. సీనియర్ పాత్రికేయులు ఈశ్వరరావు ..సత్తార్ భాస్కర్ రావు . డాక్టర్ ప్రసాద్ రావు చంద్రశేఖర్, ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి నారాయణ,  జి శ్రీనివాసరావు, ఏపీ బ్రాడ్ కాస్ట్  విశాఖ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి 

కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్.. కార్యవర్గ ప్రతినిధులు హరి ఫెడరేషన్ ఉపాధ్యక్షులు నగేష్ బాబు, హరనాధ్ తో పాటు భారీగా జర్నలిస్టులు పాల్గొన్నారు

                K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...