శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. శ్రీవారిని దర్శించుకున్న ఎయిర్ మార్షల్ జస్వీర్ సింగ్ మాన్.
సింహాచలం: 18 ఆగస్టు 2026.స్ట్రాటజిక్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (AOC-in-C) ఎయిర్ మార్షల్ జస్వీర్ సింగ్ మాన్ నేడు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన ఎయిర్ మార్షల్ జస్వీర్ సింగ్ మాన్‌కు ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి కె. తిరుమలేశ్వరరావు, అర్చక స్వాములు మరియు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించారు.
స్వామివారి దర్శనానంతరం ఆలయ వేద పండితులు ఎయిర్ మార్షల్ జస్వీర్ సింగ్ మాన్‌కు వేద మంత్రోచ్ఛారణలతో వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈవో స్వామివారి ప్రసాదాలు, అందజేశారు.
ఈ సందర్భంగా ఎయిర్ మార్షల్ జస్వీర్ సింగ్ మాన్ స్వామివారి దర్శనం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు ఆయనకు సింహాచల క్షేత్ర విశిష్టత, స్వామివారి ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి వివరించారు.

Comments
Post a Comment