Skip to main content

వీఎంఆర్‌డీఏలో ఘనంగా స్వాతంత్య్రదినోత్సవం


వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో 80వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం సిరిపురం దరి వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో 


వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ఎం.వి.ప్రణవ్‌గోపాల్‌ పాల్గొని ముందుగా మహానీయులు మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌ల చిత్రపటాలకు పూలమాలంకరణ చేసి, నివాళులు అర్పించారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనం ఈ రోజు ఇంత సురక్షిత జీవనం సాగిస్తున్నాం అంటే, 


ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలు, పోరాటాలు, దేశభక్తి మరియు అంకితభావం ఫలితమే అని. వారి త్యాగాలను స్మరించుకోవడం, వారి ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధికి మన వంతు కృషి చేయడం  భారతీయులుగా మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. గౌ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నిర్దేశకత్వంలో విశాఖపట్నం మహానగర ప్రాంతం సమగ్రంగా, సుస్థిరంగా, పర్యావరణహితంగా అభివృద్ధి చెందేలా వీఎంఆర్‌డీఏ నిరంతరం కృషి చేస్తోందని, అలానే గ్రామీణ ప్రాంతాలను పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు నిదులు కేటాయించటం జరుగుతుందన్నారు. ఈ లక్ష్య సాధనలో సంస్థ అధికారులు, 


ఉద్యోగులు మరియు సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యాలు మరియు పారదర్శకమైన సేవలు అందించేందుకు మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వీఎంఆర్‌డీఏ ద్వారా ఇటీవల అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అనుకున్న సమయంలో వాటిని పూర్తి చేసి విశాఖ అభివృద్ధి పట్ల మనయొక్క నిబద్ధతను చాటామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. 


మన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం అత్యంత కీలకమని, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, సమర్థవంతమైన వనరుల వినియోగం మరియు బాధ్యతాయుతమైన పౌర జీవనం ద్వారా మన నగరం మరింత సుందరంగా, సురక్షితంగా, అభివృద్ధి చెందిన ప్రాంతంగా రూపుదిద్దుకునేలా ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని కోరారు.


 మన దేశ ఐక్యత, సమగ్రత, శాంతి, సౌభ్రాతృత్వం మరియు అభివృద్ధి కోసం అంతా కలిసికట్టుగా ముందుకు సాగుదామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ దాట్ల కీర్తి, కార్యదర్శి మురళీకృష్ణ, ఒ.ఎస్‌.డి. కృష్ణానాయక్, ఎస్టేట్ అధికారి దయానిధి, ప్రధాన గణాంకధికారి శ్రీ ఋషిబాబు, పర్యవేక్షక ఇంజనీర్లు మధుసూదన రావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు

                   K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...