ప్రపంచవ్యాప్తంగా ఏఐ , డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలను విస్తరించేందుకు అనువుగా విశాఖపట్నంలో ఫ్యూచర్‌నౌ కేంద్రాన్ని ప్రారంభించిన ఐబిఎం* • ఐబిఎం కన్సల్టింగ్ ఫ్యూచర్‌నౌ కేంద్రం, ప్రపంచవ్యాప్త కన్సల్టింగ్ డెలివరీకి మరియు ఏఐ-ఫస్ట్ పరివర్తన ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి రూపొందించబడింది.
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 5, 2026: భారతదేశపు డిజిటల్ పరివర్తన, ప్రతిభావంతులపై కంపెనీ కొనసాగిస్తున్న పెట్టుబడులను మరింత విస్తృతం చేస్తూ విశాఖపట్నంలో తమ కొత్త ఐబిఎం కన్సల్టింగ్ ఫ్యూచర్‌నౌ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఐబిఎం(NYSE: IBM)
ఈ రోజు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, డేటా, అనలిటిక్స్, సైబర్‌సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ట్రాన్సఫార్మేషన్ వంటి సామర్థ్యాలతో ప్రపంచవ్యాప్తంగా క్లయింట్‌లకు కన్సల్టింగ్ , టెక్నాలజీ సేవలను అందించడంలో ఈ కేంద్రం మద్దతు ఇస్తుంది. ఇది ఏఐ-ఫస్ట్ క్లౌడ్ పరివర్తన , సేవలు, ప్లాట్‌ఫామ్ ఇంజనీరింగ్, సర్వీస్ ఇంటిగ్రేషన్, క్వాలిటీ ఇంజనీరింగ్ మరియు యూజర్ ఎక్స్‌పీరియన్స్ సేవలకు ఒక కేంద్రంగా కూడా పనిచేయనుంది.
భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న సాంకేతిక కేంద్రాలలో ఆవిష్కరణ, డెలివరీ సామర్థ్యాలను విస్తరించడంపై ఐబిఎం దృష్టిని ఫ్యూచర్‌నౌ కేంద్రం ప్రతిబింబిస్తుంది. పెరుగుతున్న డిజిటల్ ప్రతిభావంతులు, పటిష్టమైన విద్యాసంస్థలు, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థతో విశాఖపట్నం ప్రపంచవ్యాప్త క్లయింట్లతో కలిసి పనిచేయడానికి, అదే సమయంలో ఈ ప్రాంతంలోని నైపుణ్యం గల నిపుణులకు కొత్త అవకాశాలను సృష్టించడానికి అనువుగా ఉంది. ఫ్యూచర్‌నౌ సెంటర్ ద్వారా, ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసుకోవాలని, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే టెక్నాలజీ వర్క్‌ఫోర్స్ అభివృద్ధికి తోడ్పడాలని ఐబిఎం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్‌ఆర్‌డి శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్, ఐబిఎం ఇండియా & సౌత్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఐబిఎం నుండి ఇతర ప్రముఖుల సమక్షంలో ఫ్యూచర్‌నౌ సెంటర్‌ను ప్రారంభించారు.
ఈ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు హెచ్‌ఆర్‌డి శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ మాట్లాడుతూ “ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సేవలు , సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా విశాఖపట్నం ఆవిర్భవించడాన్ని ఐబిఎం ఫ్యూచర్‌నౌ సెంటర్ బలంగా సమర్థిస్తోంది. మా లక్ష్యం, కేవలం సాంకేతిక పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాదు, నాణ్యమైన ఉపాధిని సృష్టించడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభను అభివృద్ధి చేయడం మరియు ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యేలా చేసే ఒక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం. ఆంధ్రప్రదేశ్ పట్ల ఐబిఎం చూపుతున్న నిరంతర నిబద్ధతను మేము స్వాగతిస్తున్నాము. ఏఐ, డిజిటల్ పరివర్తన కోసం విశాఖపట్నాన్ని భారతదేశంలోని అగ్రగామి కేంద్రాలలో ఒకటిగా తీర్చిదిద్దడానికి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము ” అన్నారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యంను సాకారం చేసుకోవడానికి, తమ ప్రతిభ, ఆవిష్కరణ, సాంకేతిక సామర్థ్యాలను మేళవించడం ద్వారా డిజిటల్ యుగంలో నాయకత్వం వహించడానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని భారతదేశం కలిగి ఉంది. ఐబిఎం వద్ద మేము, మా క్లయింట్లు ఏఐ, శాశ్వత విలువను సృష్టించే ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల స్వీకరణను వేగవంతం చేయడానికి వీలు కల్పించే సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి కట్టుబడి ఉన్నాము "
అని ఐబిఎం ఇండియా మరియు సౌత్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ అన్నారు. "విశాఖపట్నంలోని ఐబిఎం కన్సల్టింగ్ ఫ్యూచర్‌నౌ సెంటర్ ఈ నిబద్ధతను ప్రతిబింబించడంతో పాటు, ఆవిష్కరణలు , సాంకేతికత డెలివరీలో ప్రపంచ గమ్యస్థానంగా భారతదేశ పాత్రను మరింతగా పునరుద్ఘాటించనుంది," అని ఆయన జోడించారు.
అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రతిభ, బలమైన విద్యాసంస్థలు , పెరుగుతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ యొక్క ఆకర్షణీయమైన కలయికను విశాఖపట్నం అందిస్తుంది. ఇది క్లయింట్ల పరివర్తన ప్రయాణాలకు మద్దతు ఇవ్వడానికి ఒక ముఖ్యమైన ప్రదేశంగానూ నిలుస్తుంది. ఐబిఎం ఫ్యూచర్‌నౌ సెంటర్ ద్వారా మేము సాంకేతిక నైపుణ్యాన్ని మరియు స్థానిక ప్రతిభను ఒకచోట చేర్చి, ఏఐ ,
డిజిటల్ పరివర్తనను క్లయింట్లు వేగవంతం చేయడానికి సహాయపడటంతో పాటు ఈ ప్రాంతంలోని తదుపరి తరం టెక్నాలజీ నిపుణులకు అర్థవంతమైన అవకాశాలను సృష్టిస్తున్నాము," అని ఐబిఎం కన్సల్టింగ్ ఫ్యూచర్‌నౌ సెంటర్, ఇండియా మేనేజింగ్ పార్టనర్ ఉషా శ్రీకాంత్ అన్నారు.
ఐబిఎం కన్సల్టింగ్ ఇప్పుడు భారతదేశంలోని అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూరు, గుర్గావ్, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబై, మైసూరు, నోయిడా, పూణే మరియు విశాఖపట్నం సహా పదిహేను ప్రదేశాల నుండి ఫ్యూచర్‌నౌ సెంటర్లను నిర్వహిస్తోంది.
K.V.SHARMA EDITOR










Comments
Post a Comment