Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం భక్తుల సౌకర్యాలపై ఈఓ జల్లేపల్లి వెంకట్రావు ప్రత్యేక దృష్టి సింహగిరిపై క్యూలైన్లు, వాష్‌రూములు, తాగునీటి వసతులపై క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీ


సింహాచలం, ఆగస్టు 20: శ్రీశ్రీశ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా గురువారం ఇంజనీరింగ్, సానిటరీ, అధికారుల బృందంతో కలిసితో  కొండపై క్యూలైన్లు, వాష్‌రూములు, తాగునీటి వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు.


ఈ సందర్భంగా క్యూలైన్లలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ కూలర్లు, తాగునీటి నాణ్యత, నీటి రుచి, వాష్‌రూముల పనితీరు, పరిసరాల పరిశుభ్రతను ఈఓ స్వయంగా పరిశీలించారు. క్యూలైన్లలో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ల నుంచి స్వయంగా నీటిని తాగి నీటి నాణ్యతను పరిశీలించడం విశేషం. భక్తులకు అందుతున్న తాగునీటిలో ఎటువంటి లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.


పుట్ట బంగారం ప్రాంతం నుంచి కిందికి భక్తులు సులభంగా రాకపోకలు సాగించేలా మెట్ల ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కుడివైపు బస్టాండ్‌కు దిగే భక్తులకు, బస్టాండ్ నుంచి కొండపైకి వచ్చే భక్తులకు ఉపయోగపడేలా నిర్మిస్తున్న మెట్ల పనుల పురోగతిని పరిశీలించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.


క్యూలైన్లలో ఉన్న ప్రతి గేటుకు ప్రత్యేక నంబర్ కేటాయించి, తాళాలు ఏర్పాటు చేయాలని ఈఓ సూచించారు. తాళాలపై కూడా గేటుకు సంబంధించిన నంబర్ ఉండేలా చూడాలని, అన్ని తాళాలను డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచాలని ఏఈ రవిరాజును ఆదేశించారు. అవసరమైన సమయంలో గేట్లను సులభంగా గుర్తించి నిర్వహించేలా ఈ విధానం ఉండాలని తెలిపారు.


కొబ్బరికాయలు విక్రయించే వెండర్ షాపుల వద్ద తప్పనిసరిగా డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలని ఈఓ స్పష్టం చేశారు. డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయకపోతే సంబంధిత టెండర్‌ను రద్దు చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాల వద్ద కూడా ప్రత్యేకంగా డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సానిటరీ సిబ్బందిని ఆదేశించారు.


గత వారం నిర్వహించిన తనిఖీల్లో సూచించిన పనుల అమలును కూడా ఈఓ పరిశీలించారు. సుభదా మండపంలో భక్తులకు కూలర్ల ద్వారా అందిస్తున్న తాగునీటి నాణ్యతను పరిశీలించి, నిరంతరం నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు.

పెండింగ్‌లో ఉన్న ఫ్యాబ్రికేటెడ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కళ్యాణ మండపం ఆవరణలో పేరుకుపోయిన వేస్ట్ మెటీరియల్‌ను తక్షణమే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.

స్వామివారి ఆలయం వెనుక భాగంలో అర్చకుల సౌకర్యార్థం వాష్‌రూమ్, డ్రెస్ చేంజింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భక్తులతో పాటు ఆలయ సిబ్బంది, అర్చకుల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని వసతులను మెరుగుపరచాలని తెలిపారు.

భక్తులకు అందించే ప్రతి సౌకర్యం పరిశుభ్రంగా, సక్రమంగా పనిచేసేలా అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఈఓ జల్లేపల్లి వెంకట్రావు స్పష్టం చేశారు. భక్తుల సంతృప్తి, సౌకర్యమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ తనిఖీల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, సానిటరీ విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి పిల్లా శ్రీనివాస్, పర్యవేక్షణ అధికారి సిరిపరుపు కనకరాజు, ఇంజనీరింగ్ ఏఈలు రవిరాజు, తిరుపతిరావు, వర్క్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, సింహగిరి శానిటరీ సొసైటీ, పద్మావతి శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...