పంచాయతీ రాజ్ ఎస్.ఈ రామకృష్ణరెడ్డి సేవలు కొనసీమకు పదిలం... అట్టహాసంగా రామకృష్ణారెడ్డి దంపతులకు ఘనసన్మానం....
. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం...పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఎస్సీగా పదోన్నతిపై కాకినాడకి బదిలీపై వెళ్లిన కార్యనిర్వాహక ఇంజనీర్ పులి రామకృష్ణారెడ్డిని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు గజమాలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
ముందుగా స్థానిక పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ నుండి సతీసమేతంగా విచ్చేసిన రామకృష్ణారెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల అలంకరించి సభా ప్రాంగణానికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ నుండి వచ్చిన తనని కోనసీమ ప్రజలు ఆప్యాయతగా చూసుకోవడం జీవితంలో మధురస్మృతులుగా ఉంటాయని తెలిపారు.
డీఎస్పీ ప్రసాద్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలుపుతూ రామకృష్ణారెడ్డి పనికి నిబద్ధత కొలమానమని నూతనంగా డి ఎస్ పి కార్యలయం సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. డిఆర్ఓ వి. సుబ్బారావు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి ఎస్సీ గా బదిలీపై వెళ్ళటం సంతోష దాయకమని తెలిపారు. ఆర్ డి వో మాట్లాడుతూ కలెక్టర్ మన్నలను పొందిన అధికారని కొనియాడారు. ప్రాజెక్ట్స్ డిప్యూటీ ఈఈ అన్యం రాంబాబు మాట్లాడుతూ కాయిర్ టెక్నాలజీతో కోనసీమ రోడ్స్ కు కలెక్టర్ సూచనలతో అభివృద్ధికి అంకురార్పణ చేశారన్నారు. డి. ఈ రాజ్ కుమార్ మాట్లాడుతూ అయన తక్కువగా మాట్లాడుతూ తమతో ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే పనులను చేయించే వారని, ఆయన సూచనలు ఎప్పటికి మరువలేవమని అన్నారు.ఈ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈ ఈ సీతం నాయుడు కాకినాడ రఘురామ రెడ్డి సీతయ్య డి ఈ లు ఇంజనీరింగ్ సిబ్బంది కాంట్రాక్టర్ ఆంజనేయుల రెడ్డి, కాంట్రాక్టర్ అల్లాడి వెంకట రమణ కాంట్రాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment