Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం, సింహాచలం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ .

సింహాచలం:తేదీ: 01 ఆగస్టు 2026గౌరవ పార్లమెంట్ సభ్యులు, లోక్‌సభ ప్యానెల్ స్పీకర్, మాజీ డీజీపీ (ఐపీఎస్) శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్  నేడు (శనివారం) సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నాదస్వర మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ ఆలయంలోకి ఆహ్వానించారు. 

అనంతరం అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకునే సంప్రదాయాన్ని నిర్వహించారు.

తదుపరి  శ్రీ స్వామివారి సహస్రనామార్చన సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో మూలవిరాట్టును దర్శించుకొన్నారు.

దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలు, జ్ఞాపికగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...