Skip to main content

జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,


విశాఖపట్నం: 20.08.2026 దిన ప్రపంచ దోమల దినోత్సవం సందర్భముగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యలయములో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు హాజరైన ANM, ASHAs, NMEP సబ్ యూనిట్, AM  యూనిట్ గాజువాక, GVMC సిబ్బంది, DMO ఆఫీస్ సిబ్బంది మరియు  ఇతర సిబ్బంది ని ఉద్దేశించి మాట్లాడుతూ-1897లో ఆగస్టు 20న సర్ రోనాల్డ్ రాస్ అనే బ్రిటిష్ డాక్టర్ "ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్లనే మలేరియా వస్తుంది" అని కనుగొన్నారు. ఆయన కనుగొన్న రోజునే గుర్తుగా ప్రతి ఏడాది ఆగస్టు 20న World Mosquito Day జరుపుకుంటాం. సర్ రోనాల్డ్ రాస్ కు 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా వచ్చింది.  2026 థీమ్/లక్ష్యం మనందరం కలిసి ముందుకు అడుగు వేస్తే దోమలను నిర్మూలించడం, వ్యాధులను నియంత్రించగలం, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం. దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి ముఖ్యంగా మలేరియా,  డెంగ్యూ, చికున్ గున్యాగురుంచి, జికా మరియు ఫైలేరియా గురుంచి  అవగాహన కల్పించడం. దోమల బారి నుండి రక్షణకు ప్రజలలో  క్రింది విషయాలలో అవగాహన  కల్పించాలని ఆదేశించారు. నీరు నిల్వ ఉంచవద్దు: కూలర్, పూల కుండీలు, టైర్లలో నీరు నిల్వ చేయొద్దు. వారానికి ఒకసారి శుభ్రం చేయాలి . దోమతెర వాడండి: ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు రాత్రి దోమతెర తప్పనిసరి. ఫుల్ స్లీవ్స్ దుస్తులు: ఉదయం, సాయంత్రం దోమలు ఎక్కువగా ఉంటాయి. దోమల కాయిల్/లిక్విడ్: కానీ గదిలో గాలి ఉండేలా చూడాలి.  పరిసరాలు శుభ్రంగా ఉంచడం: చెత్త, మురుగు నీరు లేకుండా చూడాలి. తరువాత జిల్లా మలేరియా అధికారి గారు మాట్లాడుతూ-  ఈ రోజు ఉద్దేశ్యం: "దోమలను నిర్మూలించడం = వ్యాధులను నిర్మూలించడం" అని వివరించారు.  అలాగే అవగాహన ర్యాలీలు పాఠశాలలు, PHC, UPHC, కళాశాలల విద్యార్థులతో "దోమలు లేని ఇల్లు - వ్యాధులు లేని ఊరు" అనే నినాదంతో ర్యాలీలు పాఠశాలలు &కళాశాలల్లో-- వ్యాసరచన, వ్యాస, పోస్టర్ పోటీలు: "దోమలను ఎలా నివారించాలి" అనే టాపిక్‌పై - నాటకాలు, స్కిట్స్: దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి విద్యార్థులతో - స్వచ్ఛ భారత్ + దోమల నిర్మూలన: పాఠశాల ప్రాంగణం శుభ్రం చేయడం

TV, రేడియో, సోషల్ మీడియా: APCHFW, WHO వారు #World Mosquito Day #Fight The Bite అనే హ్యాష్‌ట్యాగ్‌లతో అవగాహన వీడియోలు  - SMS/వాట్సాప్ మెసేజ్‌లు: "వారానికి ఒకసారి నీరు మార్చండి" లాంటి సందేశాలు

శ్రీ బి.నాగేశ్వర రావు వారు జిల్లా మాస్ మీడియా అధికారి హాజరైన సిబ్బంది మరియు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. 

అనంతరము DM&HO కార్యాలయము నుంచి ర్యాలి నిర్వహించి నినాదాలిస్తూ సత్యం జంక్షన్ వరకు వెళ్లి ప్రజలలో అవగాహన కల్పిస్తూ తిరిగి కార్యాలయమునకు చేరుకున్నారు. 

ఈ కార్యక్రమం లో జిల్లా ప్రోగ్రాం అధికారులు డా.లూసి, డి.ఐ.ఒ, డా.హారిక, ఆర్.బి.ఎస్.కె.జిల్లా సమన్వయకర్త, రిజర్వ్ వైద్య సిబ్బంది డా.బాలాజీ, డా.నళిని, డా.రవి కిరణ్, శ్రీ వరప్రసాద్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి, శ్రీమతి సయ్యద్ బేగం డిప్యూటీ హెచ్.ఇ.ఒ, శ్రీ బి.నాగభూషణం అసిస్టెంట్ మలేరియా అధికారి, మరియు శ్రీ పి.సాంబమూర్తి, బయాలజిస్ట్, ఎ.పి.ఎం.ఒ లు, మర్లేరియా సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి  

విశాఖపట్నం

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...