కొమ్మాది, ఆగస్టు 7:_ స్థానిక రైతుబజార్ లో సబ్సిడీ ధరకు బియ్యం అందజేసే ప్రత్యేక కౌంటర్ ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. బహిరంగ మార్కెట్ లో రూ. 62 గా ఉన్న కేజీ స్టీమ్డ్ బియ్యాన్ని రూ.52కు.. రూ. 58 కు విక్రయిస్తున్న రా బియ్యం రూ. 50కు అందజేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్లు,
500 రైస్ మిల్లుల ఔట్ లెట్ స్టోర్ లలో తగ్గింపు ధరలకు ఈ రెండు రకాల బియ్యం లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ వి.అయ్యప్ప నాయుడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, నాగోతి సత్యనారాయణ, పిల్లా వెంకట్రావు, మామిడి దుర్గారావు, కానూరు అచ్యుతరావు, గడ్డి శ్రీను, నాగోతి సూర్య ప్రకాష్, బోయి రమాదేవి, కాళ్ల నగేష్ కుమార్, కురుమిన లీలావతి, జేడీ పి.సుధాకర్, డీడీ శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ హరిత తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment