Skip to main content

సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కుటుంబాలకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా.... జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యవేక్షణలో సహాయక చర్యలు... భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులతో సమన్వయంతో విస్తృత గాలింపు...

.                SRINIVAS SPL Correspondant 
అల్లవరం, విశాఖ సందేసం...డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక, గాలింపు చర్యలను కొనసాగిస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలోని ఫిషరింగ్ ల్యాండ్ సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నిడియా దేవి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు, ముమ్మిడివరం స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిరాజు, మత్స్యశాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్ లతో కలిసి ఆయన క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తూ, గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కింజరాపు అచ్చేన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గల్లంతయిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు భరోసా కల్పించే దిశగా పనిచేయాలని మంత్రి కోరారు. అదేవిధంగా రాష్ట్ర మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం, పోలీస్, మెరైన్ విభాగాలు భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని తెలిపారు. ఆగస్టు 3వ తేదీన ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి **IND-AP-E8-MO-135 (ముత్యాలమ్మ బోటు)**లో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. కోపనాతి రామకృష్ణ, కొల్లాటి యేసుదాసు, పాలేపు సంతోషరావు, కర్రి రాంబాబు, కొల్లాటి శ్రీనుబాబు, సంగడి తాతారావు, పోనాడి సతీష్‌లు ఈ బోటులో ఉన్నారు. వీరంతా అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలకు చెందినవారని బాదిత కుటుంబాలు మంత్రికి తెలియజేశారు.సాధారణంగా పది రోజుల్లో తిరిగి వస్తామని కుటుంబ సభ్యులకు తెలిపి సముద్రంలోకి వెళ్లినప్పటికీ, నిర్ణీత గడువు దాటిన తరువాత కూడా బోటు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 17న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ డా.ఆర్ మహేష్ కుమార్ వెంటనే స్పందించి గాలింపు చర్యలను ప్రారంభించారని బాధితులు తెలియజేశారు.

గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్‌కు చెందిన 5 నౌకలు, భారత నౌకాదళానికి చెందిన 2 నౌకలు, అలాగే నేవీకి చెందిన 2 అత్యాధునిక విమానాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సుమారు 300 నాటికల్ మైళ్ల పరిధిలో సముద్ర ప్రాంతాన్ని జల్లెడ పడుతూ బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం నిరంతరంగా శోధన కొనసాగుతోందని మంత్రి అచ్చేన్నాయుడు భరోసా ఇచ్చారు.ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం తదితర తీర ప్రాంతాల రక్షణ విభాగాలకు సమాచారం అందించి సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. సముద్ర ప్రవాహాలు, వాతావరణ పరిస్థితులు, బోటు ప్రయాణించే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని గాలింపు పరిధిని విస్తరిస్తున్నారని తెలిపారు. తాజాగా ఒడిశాలోని పారాదీప్‌కు సుమారు 15 నాటికల్ మైళ్ల దూరంలో పసుపు రంగులో ఉన్న ‘ముత్యాలమ్మ’ పేరుతో కూడిన బోటును గుర్తించినట్లు సమాచారం అందింది. దీనిపై అధికారులు అప్రమత్తమై, గుర్తించిన బోటు గల్లంతైన మత్స్యకారుల బోటేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించామని తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులతో జిల్లా యంత్రాంగం నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోందని,జిల్లా ఇన్‌చార్జి మంత్రి  కింజరాపు అచ్చెన్నాయుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.గాలింపు చర్యల్లో లభిస్తున్న తాజా సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, మత్స్యకారులను సురక్షితంగా గుర్తించి ఒడ్డుకు చేర్చే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని మత్స్య శాఖ మంత్రి తెలిపారు.

ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, మత్స్యశాఖ, భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీస్, తీర ప్రాంత రక్షణ విభాగాలు సమన్వయంతో గాలింపు, రక్షణ చర్యలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయని రాష్ట్ర మత్స్యశాఖ వెల్లడించిందని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్డీవో ఎ సరళావతి, అముడ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ మత్స్యశాఖ జేడీ కరుణాకర్,మత్స్యశాఖ ఏడి రమణారావు, ఎఫ్ డి ఓ శివరామకృష్ణ, ఎమ్మార్వోలు కూటమి నాయకులు మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...