తూర్పుగోదావరి జిల్లా, లంకల గన్నవరం ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్లి, ఆమె బంధువులను కలిసి సీతమ్మ గారి 5వ తరగతి వారసులతో కలిసి దిగిన ఫోటోను విశాఖపట్నం వన్ టౌన్ నందు ఉన్న వివేకానంద సంస్థ వారు అందించడం జరిగింది. ఆంధ్రుల అన్నపూర్ణమ్మగా ప్రసిద్ధి చెందిన, డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో శ్రీ స్వామి వివేకానంద అనాధాశ్రమం వారు ప్రతిరోజు నిత్యం అన్నార్తులకు మధ్యాహ్నం, రాత్రివేళ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రౌండ్ టేబుల్ సంస్థ సాకారంతో వారంలో మూడు రోజులు మరొక 200 మందికి అదనంగా భోజనాలను అందిస్తున్నట్లు తెలియజేస్తూ, ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు అప్పారావు మాట్లాడుతూ, చిన్నతనం నుంచి సీతమ్మ గారి తండ్రి బువ్వ అన్న గారిని ఆదర్శంగా తీసుకొని
, భర్త జోగన్న గారి ఆశీస్సులతో ప్రతిరోజు ఏ సమయంలోనైనా అందరికీ ఉచితంగా నిత్య అన్నదానం నిర్వహించేవారు అని, అందుకే ఆమె పేరు చిరస్థాయిగా ఆంధ్ర రాష్ట్రమంతటా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఘనత ఆమెది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు గజపతి స్వామి, ch. మసేన్, సత్తిబాబు, ch. ఎల్లాజీ,P. నల్ల రాజు, p. అప్పలకొండ భానోజీ రావు, ఈశ్వరరావు, శ్రీరామ్ మరియు సంస్థ మహిళ సభ్యులు పాల్గొన్నారు.


Comments
Post a Comment