విజయవాడ :విశాఖ సందేశం వార్తా వాహిని :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి కొలుసు పార్థసారధి విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మీడియం స్మాల్ డెయిలీ & పీరియాడికల్స్ జర్నలిస్టుల అసోసియేషన్ లోగోను బుధవారం ఆవిష్కరించారు.
చిన్న పత్రికల జర్నలిస్టుల సంఘం ఏర్పడిన సందర్భంగా మంత్రి లోగోను ఆవిష్కరించి,సంఘం ఏర్పాటులో కృషి చేసిన వారికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పి.హుస్సేన్ ఖాన్,కార్యదర్శి కలిమిశ్రీ చిన్న పత్రికల్లో పని చేస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు.
K.V.SHARMA EDITOR


Comments
Post a Comment