అల్లవరం, విశాఖ సందేశం....అల్లవరం మండలం యెoట్రుకోన గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై, నగదు, గృహోపకరణాలు, ఇతర వస్తువులు కోల్పోయిన తిక్కిరెడ్డి లక్ష్మి కుటుంబానికి మానవతా దృక్పథంతో
రుద్రరాజు సీతాపతిరాజు మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ గోడిలంక మరియు మోసుగంటి గంగయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కొమరగిరిపట్నం సంయుక్త ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం,
నిత్యావసర సరుకులు, దుస్తులు,
మరియు నగదు సహాయం అందజేశారు.
ఈ సహాయ కార్యక్రమం గ్రామ మాజీ సర్పంచ్ తిక్కిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో నిర్వహించగా
“అగ్నిప్రమాదంతో సర్వస్వం కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచి, ఆపద సమయంలో మానవతా దృక్పథంతో సహాయం అందించిన దాతలకు హృదయపూర్వక ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని గ్రామ మాజీ సర్పంచ్ తిక్కిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు రుద్రరాజు రమేష్ రాజు,మోసుగంటి.వెంకటేశ్వరరావు,వాసర్ల సత్యనారాయణ, వర్రే సూరిబాబు, తిక్కిరెడ్డి బాబూరావు తదితరులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Comments
Post a Comment