జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు*
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ రోజు అనగా 03-08-2026 న విశాఖ జిల్లాలో గల పలు సమస్యల పై జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మాట్లాడుతూ ఆలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయడం మరియు TTDతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సాంస్కృతిక ప్రదర్శనల ఎంపికకు పారదర్శక విధానం రూపొందించవలెనని వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాస రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్, జనతా వారధి కో కన్వీనర్ కంటుభుక్త సునీత, బీజేపీ మహారాణిపేట మండల అధ్యక్షులు దేవర చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment