నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ(NSTL) వారు వివేకానంద అనాధాశ్రమమునకు గృహోపకరణాలు వితరణ......
విశాఖపట్నం :57వ ల్యాబ్ రైజింగ్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా, డైరెక్టర్ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబరేటరీ(NSTL), విశాఖపట్నం వారు, వన్ టౌన్ నందు ఉన్న శ్రీ స్వామి వివేకానంద అనాధ ఆశ్రమం నకు 4సీలింగ్ ఫ్యాన్లు,1 స్టాండ్ ఫ్యాన్,2 ప్రెజర్ కుక్కర్ లు,1 మిక్సీ, గ్యాస్ స్టవ్ మొదలైన గృహాపకరణాలు, సుమారు 25 వేల రూపాయల విలువైన వస్తువులు వివేకనంద ఆశ్రమమునకు అందించారు. స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆశ్రమమునకు గృహోపకరణాలు అందించిన NSTL సభ్యులందరికీ ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా. డైరెక్టర్. అబ్రహం వర్గీస్(Out standing scientist),DRDO,minister of Defence వారు, సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ సభ్యులు పైడిరాజు పాల్గొన్నారు.

Comments
Post a Comment