WRRT 356 ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద సంస్థ సహకారంతో, వారంలో 3రోజులు మధ్యాహ్న సమయంలో ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు. గతంలో రౌండ్ టేబుల్ సంస్థ వారు గోషా ఆస్పత్రిలో పేషంట్ల సహాయకులకు నాణ్యమైన భోజనాన్ని అందించేవారు. ఈ క్రమంలో పేదవారికి మంచి భోజనాన్ని అందించే ఉద్దేశంతో వివేకానంద సంస్థ వారి సహకారంతో ఈ నారాయణ సేవలు అందిస్తున్నామని తెలియచేశారు. ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల మాజీ చైర్మన్ మక్సుద్ అహ్మద్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, స్కూల్ కి వెళ్లడానికి సైకిళ్ళు, పేద మహిళలకు కుట్టుమిషన్లు అందించారని, వారి సేవలు చాలా అభినందనీయమని, ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సంస్థ సభ్యులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు అప్పారావు, సభ్యులు పాల్గొన్నారు.

Comments
Post a Comment