బీజేపీ శ్రీరాముడి పేరు వాడుకొని హిందువులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అనేక అక్రమాలు చేస్తోందని ఒక సామాన్యుడు, రామభక్తుడు జగన్ మురారి అన్నారు. ఈ సందర్బంగా ఆయన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శ్రీరాముడి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు, దేశంలో ఉన్న హిందువులు మేలుకోవాల్సిన అవసరం ఉందని, శ్రీరాముడి భక్తులు అన్ని పార్టీలలోనూ, సామాన్య ప్రజల్లోను ఉన్నారని ఆయన అన్నారు. శ్రీరాముడికి మోదీ బీజేపీ చెడ్డ పేరు తీసుకువస్తోందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో తీవ్రవాద దాడులు పెరిగాయాని. పుల్వమా సైనికులు, పెహల్గంలో పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారని.ఢిల్లీలో,కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న 2 రోజుల క్రితం కారు బాంబు ఎందుకు జరిగింది, దేశ సంరక్షణలో బీజేపీ ప్రభుత్వం విఫలమయిందని ఆయన అన్నారు.
మోదీ బీజేపీ చర్యల వల్ల పాకిస్థాన్ కి ఇస్లాం దేశాల నుండి మద్దతు పెరుగుతోంది, అమెరికా, చైనా లాంటి దేశాలు పాకిస్థాన్ కి ఆయుధాలు, డబ్బు సమాకురుస్తున్నాయి, పాకిస్తాన్ బలం పెరిగితే భారత్ కి పెను ప్రమాదం ఏర్పడుతుంది. మతం అజెండా వదిలి అభివృధి అజెండా దిశగా భారత్ అడుగులు వెయ్యాలి. లేదంటే ఇస్లామిక్ మరియు క్రిస్టియన్ దేశాలలో నివసిస్తున్న మన మన కుటుంబసభ్యులకు హాని జరిగే అవకాశం ఉంది, మెల్లిగా భారతదేశం ప్రపంచంలో మోదీ వల్ల ప్రధాన మిత్రులను కోల్పోయే పరిస్థితి ఉందని, ఈ దేశంలో ఉన్న హిందువులు భవిష్యత్తు పరిణామాలు ఆలోచించాలని జగన్ మురారి అన్నారు.
మోదీ విశ్వగురుగా ప్రకటించుకున్నారని, ప్రపంచ దేశాలు ఎక్కడ ప్రకటించలేదని, ఆయన సొంత డప్పు కొట్టుకుంటున్నాడని, మోదీ వల్ల హిందూ మతం, దేశం ప్రమాదంలో పడుతోందని, హిందూ ధర్మం కొన్ని వేల సంవత్సరాల నాటిదని, మతాన్ని ఎవరు కాపాడాల్సిన పని లేదని, హిందూ ధర్మం ప్రజల్ని, మన పుణ్య భూమిని కాపాడుతుందని ఆయన అన్నారు.
హిందూ మతం మీద మోదీ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే హిందువుల మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకువస్తే, హిందువుల మీద దాడి చేయడానికి భయపడతారని, ఆ పని చేస్తే మత విద్వేషాలు ఉండవని, విద్వేషాలు లేకపోతే బీజేపీకి మనుగడ ఉండదని ఆయన అన్నారు.
శ్రీరాముడిని మోదీ బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మానుకోవాలని జగన్ మురారి డిమాండ్ చేసారు.

Comments
Post a Comment