ప్రప్రంచ వేదికపై విశాఖ ప్రతిభ" * వాతావరణ మార్పుల ప్రతిఘటనకు 1 మిలియన్ అమెరికన్ డాలర్ల Bloomberg Philanthropies మేయర్ చాలెంజ్ లో గ్లోబల్ గ్రాంట్ గెలుచుకున్న విశాఖ. V-PULL జీవీఎంసీకి ఒక మోడల్ గా నిలిచింది. -జివిఎంసి కమిషనరు కేతన్ గార్గ్
ప్రపంచవ్యాప్తంగా 630కు పైగా దరఖాస్తుల మధ్య విశాఖపట్నం ప్రత్యేక ప్రతిభ కనబరిచి ఈ విజయాన్ని సాధించిందని, ప్రారంభ దశలో టాప్-50 ఫైనలిస్టులలో స్థానం సంపాదించిన జీవీఎంసీకి 50,000 అమెరికన్ డాలర్ల సీడ్ ఫండింగ్ మరియు సాంకేతిక సహాయం లభించిందన్నారు. ఆ సహాయంతో స్థానిక స్థాయిలో పైలట్ ప్రాజెక్టును అమలు చేసిందని, పైలట్ దశలో జీవీఎంసీ వార్డు స్థాయి కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించి, హైపర్-లోకల్ సెన్సింగ్ వ్యవస్థలు, డేటా ఆధారిత నిర్ణయ సాధనాలను పరీక్షించిందన్నారు. అలాగే ప్రజల భాగస్వామ్యంతో వాతావరణ ప్రతిఘటన, విపత్తు సిద్ధత చర్యలను అమలు చేసి, పౌరులు మరియు మునిసిపల్ విభాగాల మధ్య సమర్థవంతమైన ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను నెలకొల్పిందని, నగర పరిపాలనలో ప్రజల భాగస్వామ్యంతో తీసుకున్న వినూత్న చర్యలకు లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు గర్వకారణమని కమిషనరు తెలిపారు.
విశాఖ నగరాన్ని Bloomberg Philanthropies 2025–2026 మేయర్స్ చాలెంజ్ విజేతగా ఎంపిక చేయడం జివిఎంసి కి ఎంతో గౌరవం లభించదన్నారు. ప్రజల భాగస్వామ్యంతో, ప్రాంగణ స్థాయిలో పరీక్షించిన వినూత్న పరిష్కారాలతో నగరాలు మార్పుకు నాయకత్వం వహించగలవనే మా నమ్మకానికి ఇది మరింత బలాన్ని చేకూర్చింది,” అని పేర్కొన్నారు. ఈ 1 మిలియన్ అమెరికన్ డాలర్ల గ్రాంట్‌ను బాటమ్-అప్ విధానాన్ని బలోపేతం చేయడానికి, విపత్తు సిద్ధతను మెరుగుపరచడానికి, ఈ కార్యక్రమాలను నగరంలోని మరిన్ని వార్డులకు విస్తరించడానికి వినియోగించనున్నట్లు కమిషనరు తెలిపారుఈ సందర్భంగా సమస్యలను పరిష్కరించడంలో ధైర్యంగా, సృజనాత్మకంగా మరియు ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి స్పందించే నగర పాలక సంస్థలే అత్యంత సమర్థవంతమైనవి. మరిన్ని నగరాలు విజయం సాధించేందుకు మేయర్స్ చాలెంజ్‌ను ప్రారంభించామని Michael R. Bloomberg, Bloomberg Philanthropies స్థాపకుడు, New York City మాజీ మేయర్ పేర్కొన్నారని కమిషనరు తెలిపారు.
రాబోయే నెలల్లో జీవీఎంసీ ప్రత్యేక ఇన్నోవేషన్ అమలు బృందాన్ని ఏర్పాటు చేసి, పైలట్ కార్యక్రమాలను మరిన్ని వార్డులకు విస్తరించనుందని, అలాగే విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యాలను బలోపేతం చేయనుందని, విశాఖపట్నం ఈ గ్లోబల్ వేదికను Rio de Janeiro, Barcelona, Toronto, Cape Town, Budapest, Medellín మరియు Belfast వంటి ప్రముఖ అంతర్జాతీయ నగరాలతో పంచుకుంటోందని కమిషనరు తెలిపారు.
పౌర సంబంధాల అధికారిజివిఎంసి



Comments
Post a Comment