Skip to main content

మార్చి 4న ఛలో విజయవాడ విజయవంతం చేయండి: ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పిలుపు..

 అమలాపురం :విశాఖ సందేసం.:అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 4న చలో విజయవాడ కార్యక్రమంలో ప్రతి జర్నలిస్టు పాల్గొని విజయవంతం  చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కోశాధికారి మట్టపర్తి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అమలాపురం కాటన్ గెస్ట్ హౌస్ లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో APWJF ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఇల్లు, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వాలు హామీలు ఇస్తున్న వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి ఎన్నికల  సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి జర్నలిస్టుకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం కేటాయించడంతో పాటు ఇల్లు కూడా మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వృద్ధాప్యంలో ఉన్న జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. చలో విజయవాడ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు బంగారు రాజు, కడలి రాజు, సామంతుల హరి, పివి రావు, పళ్ళ సూర్యప్రకాశరావు,కడలి సూరిబాబు, పరమట భీమహేష్, గుబ్బల భీమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు...

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...