Skip to main content

కిమ్స్ లో కన్నులవిందుగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం...కోనసీమ కిమ్స్ ప్రాంగణంలో భద్రాద్రి వైభవం...

అమలాపురం:, విశాఖ సందేసం.:..అమలాపురం కిమ్స్ వైద్య విద్యా కళాశాల ప్రాంగణంలో  ఒక ఆధ్యాత్మికు వేదిక నిలిచింది. రేపటి నుండి జరగనున్న 3వ  ప్రపంచ తెలుగు మహాసభలకు ముందుగా, లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ కిమ్స్ యాజమాన్యం నిర్వహించిన

 శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అశేష భక్తజన సందోహం మధ్య అద్వితీయంగా జరిగింది. భద్రాచలం నుండి తరలివచ్చిన ఉత్సవ మూర్తులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య  కిమ్స్ ప్రాంగణం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించిపోయింది. యాగశాలలో విశ్వశాంతి హోమాలు శుక్రవారం ఉదయం నుండి  కిమ్స్ వేదికగా ఆధ్యాత్మిక క్రతువులు ప్రారంభమయ్యాయి. 

విశ్వశాంతిని కోరుతూ నిర్వహించిన శ్రీ లక్ష్మీ గణపతి హోమం, చండీ మహాయాగం విశేషంగా సాగాయి. కిమ్స్ అధినేత కేవీవీ సత్యనారాయణ రాజు (చైతన్య రాజు), మేనేజింగ్ డైరెక్టర్ రవి వర్మ కలిదిండి ఆధ్వర్యంలో ఈ హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి.

ముఖ్య అతిథులు కలిదిండి వీర వేంకట సత్యనారాయణ రాజు, బదరీ లక్ష్మీ దంపతుల సారథ్యంలో సీతారాముల కళ్యాణోత్సవం ప్రారంభమైంది. భద్రాచలం దేవస్థానం నుండి వచ్చిన అర్చకులు ఉదయం 10 గంటలకు అభిజిత్ లగ్నమందు కళ్యాణ క్రతువును కన్నుల పండువగా జరిపించారు. కిమ్స్ ప్రాంగణమంతా భక్తులతో నిండి, జై శ్రీరామ్ నినాదాలు హోరేత్తాయి....

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...