పరిసరాల పరిశుభ్రతతోనే బోద వ్యాధి నివారణ సాధ్యం....అమలాపురం సబ్ యూనిట్ అధికారి ఎన్. వి రామారావు బోధవ్యాధిగ్రస్తులకు కిట్లు పంపిణీ....
అల్లవరం, విశాఖ సందేసం....డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు బెండమూర్లంక ప్రాధమిక అర్యోగ కేంద్రం నందు శుక్రవారం మలేరియా సబ్ డివిజన్ అధికారి ఎన్. వి రామారావు బోధ వ్యాధిపై అవగాహన కల్పించి కిట్లను అందించారు. క్యూలెక్స్ దోమల ద్వారానే పైలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుందని అమలాపురం సబ్ యూనిట్ అధికారి యన్.వి. రామారావు పేర్కొన్నారు. పైలేరియా వ్యాధికి గురైన వ్యాధిగ్రస్తులకు అంగవైకల్యం రాకుండా పైవేమా కిట్లను బెండమూర్లంక పీహెచ్సి వైద్యులు సూర్య నగేష్, వైద్యాధికారిణి సుస్వార అందజేశారు.బోధవ్యాధిగ్రస్తులకు అంగ వైకల్యం రాకుండా ఖాగ్రత్తు కోసం ఈ మొక్క కిట్లును అందజేశామని ముందస్తూ జాగ్రత్త కోసం కిట్లను ఉపయోగించుకోవాలని వైద్యులు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎల్.వి రంగనాద్ , హెల్త్ అసిస్టెంట్లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు



Comments
Post a Comment