ప్రభుత్వం పొందుపరిచిన నియమాలు కానీ ,జరిగిన జననం/ మరణములు, పుట్టిన /మరణించిన తేదీ నుండి 21 రోజులలో ఉచితంగా నమోదు చేస్తారని, ఇంటి వద్ద కానీ, ఆసుపత్రిలో గాని జరిగిన జనన మరణములు పుట్టిన/ మరణించిన తేదీ నుండి 21 రోజుల నుండి 30 రోజుల్లోపు రూ.25/- ఆలస్య రుసుం చెల్లించి నమోదు చేసుకోవాలని, 30 రోజుల నుండి ఒక సంవత్సరంలోపు రూ. 250/- ఆలస్య రుసుము చెల్లించి నమోదు చేసుకోవచ్చని, ఒక సంవత్సరము తర్వాత రూ. 500/- ఆలస్యం రుసుము చెల్లించి నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. పుట్టిన బిడ్డ జననం నమోదు చేసిన తర్వాత ఒక సంవత్సరంలోపు ఉచితంగా శిశువు పేరును నమోదు చేసుకునే అవకాశం ఉందని, ఒక సంవత్సరం నుండి 15 సంవత్సరాలలోపు రూ. 250/- ఆలస్య రుసుము చెల్లించి శిశువు పేరును నమోదు చేసుకోవచ్చన్నారు.
జనన మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయుటకు లేదా లభ్యత లేని ధ్రువపత్రాలు (non availability certificate) కొరకు జననం మరణం శోధన చేసేందుకు ఒక సంవత్సరమునకు రూ. 50/- చెల్లించి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ పొందవచ్చునని, అదనపు సంవత్సరం శోధన చేయుటకు రూ. 25/- రూపాయలు చెల్లించి non availability certificate పొందవచ్చునని తెలిపారు. ప్రతి జనన లేదా మరణముకు సంబంధించిన ధ్రువపత్రం పొందుటకు జీవీఎంసీ సౌకర్యం కౌంటర్ లో రూ. 50/- చెల్లించి రసీదు తో పాటు సంబంధిత డాక్యుమెంట్లను కూడా జత పరిచి జనన మరణ ధ్రువీకరణ పత్రం పొందవచ్చునని ప్రధాన వైద్యాధికారి తెలిపారు.
పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ

Comments
Post a Comment